తెలంగాణ ఎన్నికల్లో ఎన్టీఆర్ అక్క అయిన సుహాసిని భరిలోకి దిగిన ఎన్టీఆర్ ప్రచారానికి రాకపోవడం చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి . అస్సలు ఎన్టీఆర్ ఏమనుకుంటున్నాడో ఒక సన్నిహిత అభిమాని రాసిన లెటర్ ఇప్పడూ సంచలనం రేపుతోంది. ఆ లెటర్ లో ఏముందంటే ...  ఎలాగైనా అన్నదమ్ములను ఎలక్షన్ బరిలోకి లాగాలని చేసిన విశ్వప్రయత్నానికి, వారు తలొగ్గ లేదని , కనీసం ఊహించని విధంగా ఒక ఆడ కూతురిని వత్తిడి చేసి , కుటుంబం వద్దు అని చెప్తోన్నా వినకుండా రాజకీయం చేసిన మీ తెలివి అమోఘం.

ఎన్టీఆర్ మనోభిప్రాయం ఇదేనా?

హరికృష్ణ కుటుంబమని ఆదరించాలంటే ఆంధ్ర లో ఎమ్మెల్సీకి అడ్డు వచ్చిందా ? నామినేటెడ్ పదవులు వద్దన్నాయా ? పోనీ ఎలక్షన్ లో దింపాల్సిందే , అదే శేరిలింగంపల్లి లో ఎందుకు టికెట్ ఇవ్వలేదు ? అదే ఖమ్మం లో ఎందుకు టికెట్ ఇవ్వలేదు ? దాదాపు అసాధ్యం అయినా కూకట్ పల్లి లో ఎందుకు ఇచ్చారు ?  గెలిస్తే హరికృష్ణ కుటుంబాన్ని ఆదరించాం అని చెప్పొచ్చు . ఓడితే, హరికృష్ణ కుటుంబానికి ప్రజాదరణ లేదు అని ముద్ర వేయొచ్చు . బోనస్ గా అక్కకు సాయం గా  అన్నదమ్ములు కనుక వస్తే, వారిని  ఆంధ్ర ఎన్నికల లో వాడుకోవచ్చు . 

Image result for jr ntr

కేవలం అక్క కు మద్దతు తెలిపి ఆంధ్రా లో ప్రచారం చేయకపోతే అన్నదమ్ములకు పార్టీ మీద ప్రేమ లేదు అని చెప్పొచ్చు . ప్రచారం చేసి గెలిస్తే అది చంద్రోదయ మహిమ అని చెప్పొచ్చు . ప్రచారం చేసినా ఓడిపోతే , జూనియర్ కి ఆదరణ లేదు , రేపు లోకేష్ యే మీ దిక్కు అని చెప్పకనే చెప్పొచ్చు ..  ఆహా .. ఏమి మీ వివేకము ఏమి ఈ విజ్ఞానము . కుటుంబాలలో చిచ్చు పెట్టి , చేతులో ఉన్న పేపర్ లలో ఇష్టం వచ్చినట్టు రాయించి , ఒక రాయితో అయిదారు పిట్ట ల ను కొట్టాలనే మీ ఆశయాన్ని చూస్తుంటే , ఆనందం తో వస్తోన్న కన్నీళ్ళని ఆపతరమా? ఇదీ ఆ వాట్సప్ మెసేజ్. ఎన్టీఆర్ మనోగతమా కాదా? అన్నది పక్కన పెడితే ఆ అభిమాని ఆలోచన కేవలం ఒక్కరితోనే సరిపోతోందా? లేక ఎన్టీఆర్ సన్నిహితులు అంతా ఇదే రీతిగా ఆలోచిస్తున్నారా? అన్న అనుమానం కలుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: