నేడు భారత దేశంలో తెలంగాణ, రాజస్థాన్ లో పోలింగ్ ప్రారంభం అయ్యింది.  ఇప్పటికే మద్యప్రదేశ్, చత్తీస్ గఢ్, మిజోరాం లో ఎన్నికలు పూర్తి అయ్యాయి.  ఈ ఐదు రాష్ట్రాల ఫలితాలు 11వ తేదిన రాబోతున్నాయి.  ప్రస్తుతం తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుండగా..రాజస్థాన్ లో అక్కడక్కడా చిన్నచిన్న గొడవలతో పోలింగ్ కొనసాగుతుంది.  జోధ్‌పూర్‌ రాజవంశీకులు గజ్‌ సింగ్‌ అతని భార్య.. సర్థార్‌పుర నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌ నెం: 194లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అజ్మెర్‌ సౌత్‌లోని నాధ్‌ద్వారా, అల్వార్‌ అర్బన్‌ ప్రాంతాలలో 100 శాతం ఓటింగ్‌ నమోదైంది. పోలింగ్‌ సజావుగా సాగేలా ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 1.44 లక్షల మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు.
rajasthan-elections-2018-assembly-elections-2018-polling
200 స్థానాలకు గాను199 సీట్లకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. సుమారు 2వేల మంది అభ్యర్థులు బరిలో ఉండగా 51,687 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల వరకు 21.89 శాతం ఓటింగ్‌ నమోదైంది.ఉదయం 11.30 : రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జొతలి అనే గ్రామంలో పోలింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి కేవలం ఒక ఓటరు మాత్రమే తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. జొతలి గ్రామస్తులు గ్రామంలోని నీటి సమస్యను పరిష్కరించే వరకు ఓటు వెయ్యబోమని తేల్చిచెప్పారు. దీంతో పోలింగ్‌ కేంద్రం వెలవెలబోయింది.

మహిళా ఓటర్ల కోసం ప్రత్యేకంగా పింక్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహిళా ఓటర్ల కోసం 259 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 51,687 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 199 అసెంబ్లీ స్థానాల నుంచి రెండువేల మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ప్రస్థుతం గడవు ముగిసిన రాజస్థాన్ అసెంబ్లీలో బీజేపీ సభ్యుల బలం 160 కాగా కాంగ్రెస్ సభ్యులు 25 మంది ఉన్నారు. భారీ బందోబస్తు మధ్య రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ పర్వానికి ముందు జోధ్ పూర్ లో మాక్ పోలింగ్ నిర్వహించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: