తెలంగాణా ఎలక్షన్ ఒక మనిషిని చంపేసింది .. పోలింగ్ కేంద్రం కి  ఓటు వేద్దాం అని వెళ్ళిన ఒక వృద్ధ వ్యక్తి చనిపోయాడు. తెలంగాణా ఎలెక్షన్ లో ఈ న్యూస్ ప్రస్తుతం కలకలం రేపుతోంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లికి చెందిన నర్సింహ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది .. పోలింగ్ కేంద్రం కాస్తంత దూరం కావడం తో నడుచుకుంటూ వెళ్ళిన నరసింహ అనే  వ్యక్తి కి కాస్తంత ఆయాసం కూడా రావడం తో అధికారులు కాసేపు కూర్చోబెట్టారు .. ఆ కాసేపటికి మంచినీళ్ళు అందించి కూర్చుని రెస్ట్ తీసుకోమని కోరారు కూడా.
Image result for telangana elections
అయితే ఇంకాసేపటికి తెరుకున్నట్టే కనిపించిన నరసింహ ఒక్కసారిగా కళ్ళు తిరిగిపడిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం నరసింహ కి ఇదివరకే గుండె పోటు వచ్చిన దాఖలాలు ఉన్నాయి అని గ్రామస్తుల ద్వారా తెలుస్తోంది. ఒక్కసారిగా నరసింహ పడిపోవడం తో షాక్ కి గురైన అధికారులు వెంటనే అంబులెన్స్ ని పిలిపించి ఆసుపత్రికి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేసారు.
Related image
దారిలోనే నరసింహ చనిపోయినట్టు డాక్టర్ లు తెలిపారు. క్యూలో నిలుచున్న కొద్ది సేపు అటూ ఇటూ అందరితో మాట్లాడుతూ కనిపించాడు అనీ ఒక్కసారిగా ఇలా జరగడం ఆశ్చర్యకరం గా ఉంది అంటున్నారు అధికారులు. ఎండలు కూడా ఎక్కువగా లేవు కాబట్టి ఇలా జరగడం తో అధికారులు షాక్ తిన్నారు.
Related image
ఈ విషయం తెలుసుకున్న నరసింహ కుటుంబ సభ్యులు మొదట ఓటింగ్ బూత్ కి తరలి వచ్చి ఆతర్వాత ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు అని తెలిసి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే వాళ్ళు వెళ్ళే లోగా నరసింహ చనిపోయాడు అని తెలిసి మొత్తం కుటుంభం భోరుమంది. ఓటు వెయ్యడం కోసం బయటకి వెళ్ళిన తమ మనిషి ఇలా విగత జీవిగా ఇంటికి వస్తాడు అని ఊహించలేదు అని అంటున్నారు వారంతా. 


మరింత సమాచారం తెలుసుకోండి: