పబ్లిసిటీ కోసం రాజకీయ నాయకులు ఎంతకైనా తెగిస్తారు.. అయితే అందరు నేతలూ ఒకలా ఉండరు. జనం సమస్యలు పరిష్కరించేందుకు కొందరు నేతలు ఎంత రిస్కయినా తీసుకుంటారు. ఇందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఒక ఉదాహరణ. స్థానికంగా ఓ మురికి కాలువపై బ్రిడ్డి నిర్మాణం కోసం ఆయన ఎవరూ చేయని సాహసం చేశారు.


సమస్య పరిష్కారం కోసం ఆయన మురుగు నీటిలో దాదాపు గంటసేపు నిలుచుకున్నారు. అధికారులు దిగి వచ్చేవరకూ బయటకు రానని భీష్మించుకున్నారు. దీంతో అధికారులు దిగి వచ్చి 45 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామన్నారు. జనం కోసం వివిధ మార్గాల్లో నిరసన తెలిపిన వారు ఉన్నారు కానీ.. ఇలా మురుగు నీళ్లలో గంటసేపు నిలుచోవడం మాత్రం నిజంగా అభినందించదగినదే.



మురుగు కాల్వలో అంతసేపు ఉంటే.. ఎన్నో ఇన్ఫెక్షన్లు వస్తాయి. చర్మ వ్యాధులు వస్తాయి. ఒక్కసారి వస్తే జీవితాంతం వెంటానే రోగాలూ అంటుకుంటాయి. అయినా శ్రీధర్ రెడ్డి జనం సమస్య కోసం అలాంటి సాహసానికి పూనుకున్నారుశ్రీధర్ రెడ్డి గతంలోనూ ఇలాంటి నిరసనలు తెలిపారు.



పోరాటం అంటే ప్రతిసారి యుద్ధమే కాదు కొన్నిసార్లు మౌన నిరసన కూడా కదా. అంతే కాదు.. పోరాటం ప్రతిపక్షం బాధ్యత. అధికారం ఉంటేనే ప్రజలకు సహాయపడగలం అనుకోవటం సరైంది కాదని.. ఫలితంతో సంబంధం లేకుండా పోరాటాన్ని కొనసాగించాలన్నది శ్రీధర్ రెడ్డి పాలసీ. గతేడాది ఒక వికలాంగుడికి అధికారులు పెన్షన్ నిరాకరిస్తే అతడిని శ్రీధర్ రెడ్డి స్వయంగా చేతుల మీద ఎత్తుకొని సంబంధిత ఆఫీసుకు తీసుకెళ్లారు.


మరింత సమాచారం తెలుసుకోండి: