ఎలక్షన్ అనగానే కొందరికి తాగడం - తందనాలు ఆడడం సరిపోతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న ఫ్రీ లిక్కర్ కోసం కొందరు ఎదురు చూస్తూ ఉంటారు. ప్రాస్తుతం తెలంగాణా లో ఎలక్షన్ నడుస్తున్న సందర్భంగా మద్యం ఏరులై పారుతుంది అని ఊహించారు చాలా మంది. అయితే దానికి ఆనకట్ట కడుతూ ఎలక్షన్ కమీషన్ ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం అందరికీ షాక్ ఇస్తోంది.
Image result for telangana 2018 elections mandhu babulu
ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల రంగంలోకి దిగిన అభ్యర్థులు పోలింగ్ అయ్యేంతవరకు ఓటర్లను కనిపెట్టుకుని చూడాల్సిన పరిస్థితి. ఆ కొత్త నిబంధన ప్రకారం తాగి వస్తే ఓటు వేయనివ్వబోమని స్పష్టం చేసింది ఎన్నికల సంఘం. ఎలక్షన్లను సజావుగా, సాఫీగా సాగాలంటే ఇలాంటి నిబంధనలు తప్పవేమో మరి. అయితే ఈ రూల్ ఇప్పుడు అభ్యర్థుల గుండెల్లో గుబులు రేపుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికల సంఘం అందుకనుగుణంగా చర్యలు చేపట్టింది.
Related image
ఈక్రమలో పోలింగ్ సజావుగా జరిగేలా కొన్ని నిబంధనలు విధించింది. తాగి వస్తే ఓటు వేయనివ్వమనేది అందులో ఒక రూల్. దీంతో అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారట. ఎంతో ఖర్చు పెట్టి ఇంతదాకా వచ్చాక ఓట్లు పడకుంటే నష్టపోతామని బాధపడుతున్నట్లు సమాచారం.అందుకే బాబ్బాబు.. ఓటేశాక ఎంత కావాలంటే అంత తాగు – కానీ ఓటుకు ముందు మందు ముట్టకు అంటూ కొంతమందిని నియమించి ఓటర్లను ప్రత్యేకంగా కలుసుకుని ఈవిధంగా ప్రాధేయపడుతున్నారు అభ్యర్ధులు.
Related image
అయితే దీని వెనకాల తెరాస మాజీ లీడర్ , చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రభావం ఉన్నట్టు చెబుతున్నారు.  రీసెంట్ గా ఆయన ఎలక్షన్ కమీషన్ కి రాసిన లేఖ ప్రభావం వల్లనే ఎలక్షన్ కమీషన్ ఈ నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. అయన ఆ లేఖలో సదరు వ్యక్తి మద్యం తాగాడా లేదా అని గుర్తించే బ్రీత్ అనలైజర్ లను పోలింగ్ కేంద్రాల్లో ఉపయోగించవలసిందిగా ఈసీకి సూచించారు.
Related image

తను ప్రచారంలో ఉండగా గ్రౌండ్ లెవల్ లో ఇలా డబ్బుని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఉపయోగించడం గమనించానని, అందుకు ఓటింగ్ సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద బ్రీత్ అనలైజర్ లతో తాగుబోతు వ్యక్తులను గుర్తించి వారిని ఓటును నిషేదించవలసిందిగా ఆయన కోరారు. ప్రస్తుతం మందు పొయ్యండి బాబోయ్ అంటూ మందు బాబులు ఓటింగ్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకంటే మందు తాగడానికి అభ్యర్ధులే ఒప్పుకోవడం లేదు మందు తాగితే ఓటు వెయ్యినివ్వరు కాబట్టి. 


మరింత సమాచారం తెలుసుకోండి: