తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలు అందరికి షాక్ కి గురి చేస్తున్నాయి. ఇప్పటికే పోలింగ్ బూత్ లో తాగి రాకుండా కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకున్నా రజత్ కుమార్. తాజాగా ఎన్నికల నేపథ్యంలో ఇతర ప్రాంతాలనుండి చాలామంది సొంత రాష్ట్రానికి వస్తున్న క్రమంలో టోల్ ప్లాజాలు వద్ద ట్రాఫిక్ జాం లేకుండా మరియు  తెలంగాణ వాసులు ఇబ్బందులు పడకుండా ఉండాలని తెలంగాణ ఎన్నికల కమిషన్ వెంటనే టోల్ ప్లాజాలు ఎత్తివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.


ఓటేసే వారు సొంత ఊళ్లకు వెళ్తుండగా ఇబ్బంది పడొద్దని ఈసీ నిర్ణయం తీసుకుంది. ఉదయం నుంచి వాహనదారులు పడ్డ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే క్రమంలో రాష్ట్రంలో ఎన్నికల ఓటింగ్ శాతం మధ్యాహ్నానికల్లా 40 శాతం దాటినట్లు చాలా పోలింగ్ బూత్ల వద్ద జనాలు ఇంకా బారులుతీరారు.

Related image

ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖులు మరియు రాజకీయ వేత్తలు తమ ఓటు హక్కును సామాన్య జనం వల్లే లైన్లో నిలబడి ఓటు హక్కుని వినియోగించుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం తెలంగాణ ఎలక్షన్ హిట్ లో ఉంది.

Related image

ఏది ఏమైనా ప్రస్తుత ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తీసుకున్న నిర్ణయాలు హైలెట్ అని...ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు తెలంగాణ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోడానికి తోడ్పడిందని అంటున్నారు చాలామంది.



మరింత సమాచారం తెలుసుకోండి: