అధికార తెరాస పార్టీ వైపు ఎక్కువగా ఎగ్జిట్ పోల్స్ మొగ్గు చూపుతూ ఉండడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది . ఎక్కడా కూడా హాంగ్ లేదా మహా కూటమి వైపు ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా దృష్టి చూపడం లేదు తెరాస పార్టీ గెలుపు తధ్యం అనే దిశగా వెళుతూ ఉన్నాయి ఈ పోల్స్ అన్నీ కూడా. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని రిపబ్లిక్ టీవీ తన ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలిపింది. 119 స్థానాలకు గాను టీఆర్ఎస్ 50 నుంచి 65 స్థానాలను కైవసం చేసుకుంటుందని పేర్కొంది.
Image result for mahakutami vs trs

మహాకూటమి 38 నుంచి 52 సీట్లలో గెలుపొందుతుందని చెప్పింది. బీజేపీకి 4 నుంచి 7 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇతరులు 10 నుంచి 17 స్థానాల్లో గెలుపొందుతారని వెల్లడించింది.  తెరాస పాలన లో జనం ఫుల్ హ్యాపీ గా ఉన్నట్టు ఈ లెక్కలు చూస్తే అర్ధం అవుతోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అన్ని ఎగ్జిట్ పోల్స్ లో తెరాస కి తక్కువ సీట్లు వేసింది రిపబ్లికన్ సర్వే అనే చెప్పాలి.
Related image
అయినా కూడా కెసిఆర్ గెలుపు గ్యారెంటీ అనే దిశగా ఈ సర్వే సాగుతోంది. జన్ కీ బాత్ అంటూ ఎప్పుడూ అట్టహాసం గా సాగే ఈ సర్వే తెలంగాణా తో పాటు ఐదు రాష్ట్రాల్లో కూడా భవిష్యత్తు ని తేల్చే ప్రయత్నం చేసింది.  
Republic Jan ki bath ప్రకారం..
తెలంగాణలో మొత్తం స్థానాలు 119 - 
టీఆర్‌ఎస్‌ - 50 - 65
ప్రజాకూటమి - 38 - 52
బీజేపీ - 04 - 07



మరింత సమాచారం తెలుసుకోండి: