తెలంగాణ శాసనసభ ఎన్నికలకు నేడు జరిగిన పోలింగ్ మొత్తం 119సీట్లుకుగాను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రజా కూటమికి మధ్య హోరాహోరీ  పోరు జరిగింది. కాంగ్రెసు తెలుగు దేశం, సిపిఐ, తెలంగాణ జన సమితి (టీజెఎస్) ఈ నాలుగు పార్టీలు ప్రజాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.  


నువ్వా? నేనా? అంటూ సాగిన ముందస్తు ఎన్నికలు టీఆరెస్ ను మాత్రమే వరించబోతున్నట్లు తెలుస్తుంది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోలింగ్ పోరు ముగిసిన వెంటనే టైమ్స్ నౌ- సీఎన్‌ఎక్స్ సర్వే & న్యూస్-18 సర్వే తమ ఎక్జిట్ పోల్స్ ను ప్రకటించాయి 


ఆ ఫలితాలు టీఆర్ఎస్ (66) ప్రజాకూటమి + (37) బీజేపీ (7) ఎమైఎం + ఇతరు (9) స్థానాలలో విజయం సాధించబోతున్నట్లు ప్రకటించగా టీఆర్ఎస్ పార్టీదే ప్రభంజనం కాకపోయినా విజయం వరిస్తున్నట్లు తెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ, మిత్రపక్షం ఎంఐఎం తో కలిపి 66 స్థానాలతో మళ్లీ అధికారాన్ని చేజిక్కుంచు కుంటున్నట్లు తన సర్వేలో తేలినట్లు ప్రకటించింది. 



మరో వైపు చివరిదశలో తన మిత్రపక్ష మీడియా ప్రచారమంతో ఒక నొక దశలో టీఆరెస్ ఓటమి చెందనుందని ప్రకటించు కున్న ప్రజాకూటమి కేవలం (37) స్థానాలకే పరిమితం అవనుండటం వారిని ముఖ్యంగా టిడిపిని షాక్ కు గురిచేసింది. అయితే ఫలితాలు ఈ నెల 11న రానున్న దరిమిలా నిరీక్షిచటం మినహా చేసేదేమీ లేదు. బిజెపి ఒంటరిగా 109 స్థానాలకు పోటీ చేసింది. కాగా, సిపిఎం నేతృత్వంలో బిఎల్ఎఫ్ కూడా కొన్ని చోట్ల పోటీ చేసింది. మజ్లీస్ హైదరాబాదు పాతనగరంలో ముఖ్యంగా పోటీలో ఉంది.



మరో ప్రముఖ న్యూస్-18 సర్వే కూడా టీఆర్‌ఎస్ పార్టీకే అధిక స్థానాలు వస్తాయని అంచనా వేసింది. టీఆర్ఎస్ 50-65 సీట్లు, మహాకూటమి 38-52, బీజేపీ 4-7, ఇతరులు 8-14 స్థానాల్లో గెలుస్తాయని న్యూస్-18 అంచనా వేసింది. 



తెలంగాణలో మరోసారి కారుదే విజయమని టైమ్స్ నౌ, సీఎన్‌ఎక్స్ సర్వే,  న్యూస్-18 సర్వేలు అంచనా వేశాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: