ఎట్టకేలకు ఈ రోజు తెలంగాణ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినాయి . అయితే పోల్స్ తరువాత వెలువడే రిజల్ట్స్ గురించి అందరూ ఆసక్తి కరంగా ఉన్నారు. అయితే టైమ్స్ నౌ కథనం ప్రకారం ఈ సారి మళ్ళీ కేసీఆర్ దే హవా అని తేల్చి పారేసింది. అయితే కేసీఆర్ చెప్పినట్టు వంద సీట్లు కాదు గానీ మునుపటి సీట్ల కంటే మూడు సీట్లు మాత్రమే ఎక్కువ వస్తాయని చెప్పాయి. అయితే తెరాస కు మినిమం మెజారిటీ గ్యారంటీ అని చెప్పింది . 

తెరాసకే పీఠమన్న ఎగ్జిట్ పోల్స్!

ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే తెరాస కు 66 సీట్లు వస్తాయని , కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మహా కూటమికి 37 సీట్లు వస్తాయని,  మజ్లిస్ పార్టీకి గరిష్టంగా ఏడు సీట్లు , ఇతరులకు 9 సీట్లు వస్తాయని సర్వే వెల్లడించింది. అయితే  పబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్ మాత్రం తెలంగాణలో ఒకింత అస్పష్టమైన ఫలితాలు ఉండవచ్చని పేర్కొంది. తెరాస 50 నుంచి 65 సీట్లను పొందగలదని, మహాకూటమి 38 నుంచి 52 సీట్లను నెగ్గుతుందని, బీజేపీ నాలుగు నుంచి ఏడు, ఇతరుల పది నుంచి పదిహేడు సీట్లను పొందుతారని రిపబ్లిక్  టీవీ అంచనా వేసింది.

Image result for telangana survey

సీఎన్ఎన్ న్యూస్ 18 కూడా ఇవే నంబర్లనే చెప్పింది. తెరాకు 50 నుంచి 65 అని, కూటమికి 38 నుంచి 52 సీట్లలో విజయం సాధించవచ్చని అంచనా వేసింది. తెలంగాణలో తెరాస స్వీప్ చేస్తుందని ఇండియాటుడే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. తెరాస ఏకంగా 71 సీటు నుంచి 91 సీట్లను సొంతం చేసుకుంటుందని ఇండియాటుడే అంచనా వేసింది. కాంగ్రెస్ కూటమి కేవలం 21 నుంచి 33 సీట్లకు పరిమితం కావొచ్చని పేర్కొంది. బీజేపీ గరిష్టంగా మూడు, మజ్లిస్ గరిష్టంగా ఏడు సీట్లు నెగ్గవచ్చని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: