దేశంలో ఇపుడు ఎన్నికల మూడ్ వచ్చేసింది. అయిదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ పూర్తి అయింది. కౌంటింగ్ మరో మూడు రోజుల్లో జరిగిపోతుంది. ఇదే వరసలో మరో అయిదారు రాష్ట్రాలు, లోక్ సభ ఇపుడు ప్రజా తీర్పు కోసం క్యూ కట్టనున్నాయి. ఆ ఎన్నికల సందడి కూడా తొందరలోనే మొదలవుతుందని అంటున్నారు.


గెలిచినా ..ఓడినా :


ప్రస్తుతం జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిలల్లో మూడింటిలో   కాంగ్రెస్, అధికార బీజేపీ ఢీ కొడుతున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ లలో రెండు పార్టీల మధ్య పోరు భీకరంగా సాగింది. రాజస్థాన్ లో బీజేపీ ఓటమి ఖాయంగా ఉంది. మధ్యప్రదేశ్, చత్తీస్ గ‌డ్ లలో హోరా హోరీ ఉంది. రేపటి ఎన్నికల్లో ఈ మూడు కాంగ్రెస్ వశమైనా లేక ఒకటి రెండు చోట్ల బీజేపీ బొటా బొటీగా అధికారం నిలబెట్టుకున్నా కూడా లోక్ సభ ఎన్నికలు ముందుకు జరగవచ్చు అంటున్నారు. 


ఆ ఊపు ప్రతిపదికగా :


ఉత్తరాది రాష్ట్రాలో ఓడితే బీజేపీ వెంటనే లోక్ సభ ఎన్నికలకు రెడీ అయిపోతుంది. ఎందుచేతనంటే ఆ గ్రాఫ్ మరింతగా పెరగకుండా జాగ్రత్త పడడానికి. ఇక గెలిచినా ఆ ఊపు కంటిన్యూ చేయడానికి ఎలాగూ ఎన్నికలకు వెళ్తుంది. దీంతో ఏ విధంగా చూసుకున్నా బీజేపీ  ఎన్నికలకు తొందరగా వెళ్ళేందుకే సమాయత్తమవుతుందని అంటున్నారు. ఇక లోక్ సభతో పాటు, ఏపీ, ఒడిషా, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్ వంటి వాటిని కూడా కలుపుకుని పోతుందని చెబుతున్నారు. 


ఫిబ్రవరిలో నోటిఫికేషన్ :


ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరిగే విధంగా బీజేపీ పావులు కదుపుతోందని డిల్లీ వర్గాల భోగట్టా. అంటే లోక్ సభ ఎన్నికల గడువుకు రెండు నెలకు ముందు అన్న మాట. ఈ రెండు నెలల వ్యవధి ఇచ్చినా దేశంలో కాంగ్రెస్ కూటమి బలపడుతుందన్న ఆందోళన కారణంగానే బీజేపీ లోక్ సభ ఎన్నికలు ముందుకు జరపవచ్చునని అంటున్నారు. అదే జరిగితే ఏపీలోనూ ఎన్నికల సందడి మొదలు కావడం ఖాయం. ఈ సంగతిని ఇంతకు ముందే ఏపీ ఎన్నికల అధికారి సిసోడియా చెప్పారు కూడా.


మరింత సమాచారం తెలుసుకోండి: