తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే అనేక సర్వేలు వెలువడ్డాయి. జాతీయ ఛానళ్ల ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీఆర్ఎస్ దే మళ్లీ విజయం అని ప్రకటించేశాయి. కానీ ఆంధ్రా ఆక్టోపస్ మాత్రం ప్రజాకూటమిదే విజయం అని తేల్చి చెప్పేశారు. ఐతే జాతీయ ఛానళ్ల ఎగ్జిట్ పోల్స్ కంటే లగడపాటి లోకల్ కావడంతో ఆయన సర్వేకు ప్రాధాన్యత ఎక్కువ.



ఇదే సమయంలో తెలంగాణపై మంచి పట్టున్న ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకులు కె. నాగేశ్వర్ తన అంచనాలను వెల్లడించారు. చక్కటి రాజకీయ విశ్లేషకుడిగా ఆయనకు మంచి పేరు ఉన్న దృష్ట్యా ఆయన విశ్లేషణకు గుర్తింపు ఉంది. కేసీఆర్ తాను చెప్పినట్టు 100 సీట్లు గెలవకపోయినా 70కుపైగా సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారం చేపడతారని కె. నాగేశ్వర్ అంచనా వేస్తున్నారు. మహా కూటమికి 30 నుంచి 35 స్థానాలు వస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు.

Image result for prof k nageshwar


బీజేపీకి 3 నుంచి 4 సీట్లు వస్తాయని కె. నాగేశ్వర్ చెబుతున్నారు. తన అంచనాలకు ఆయన విశ్లేషణ కూడ జోడించారు. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ ను తక్షణమే అధికారంలో నుంచి దింపేయాలన్నంత విస్తృతమైన బలమైన కోరిక ప్రజల్లో లేదని ఆయన అంటున్నారు. కేసీఆర్ పాలన అంత చెడ్డగానూ లేదు.. అంత గొప్పగానూ లేనందువల్ల.. ఏదో చేస్తున్నాడు కదా.. మరో అవకాశం ఇచ్చి చూద్దామనే ట్రెండ్ కనిపించిందని నాగేశ్వర్ అంటున్నారు.


Related image

మీడియాల్లో ప్రజా కూటమి గెలుస్తుందని చాలా మంది చెబుతున్నా.. మీడియాకెక్కని నోరు లేని గ్రామీణ ఓటరు కేసీఆర్ కు మద్దతుగా ఉన్నాడని నాగేశ్వర్ విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా ఏపీ సీఎం చంద్రబాబు ఖమ్మం, హైదరాబాద్ ల్లో విస్తృతంగా పర్యటించి.. కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తూ చేసిన ప్రచారం కూడా ప్రజాకూటమికి చేటు కలిగించిందని నాగేశ్వర్ అంచనా వేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రజాకూటమి ఏం చేస్తుందో చెబుతూ ప్రచారం నిర్వహించి ఉంటే బావుండేదని.. కానీ కేసీఆర్ ను టార్గెట్ చేయడంతో సగటు తెలంగాణవాది టీఆర్ఎస్ వైపే మొగ్గాడని నాగేశ్వర్ చెబుతున్నారు. మరి లగడపాటి సర్వే నిజమౌతుందా.. నాగేశ్వర్ అంచనాలు వాస్తవం అవుతాయా.. 11వ తేదీన చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: