డిసెంబర్ ఏడవ తారీఖున జరిగింది ప్రజాస్వామ్య రాజ్యంలో ఎన్నికలా? లేక గెలుపే ప్రామాణికంగా మానేజ్ చేయబడ్డ విజయమా? ఎన్నికలను ప్రహసనంగా మార్చి ఎవడి ఆట వాడు ఆడేసుకున్న ఆటలో ప్రజలు పాచికలైపోయారు.  అయితే శకుని పాచికలకున్న మాయా మోహం నేటి ప్రజలకు లేదు. అందుకే ఇక్కడ శకుని అను యాయులైన  నాయకులు గెలిచారు.

Image result for no of votes missed in telangana voters lists

ఆ ఎన్నికల మాయాజూదంలో తొలిమెట్టు ఓట్లగల్లంతు. అదీ ఒకచోట ఒకగ్రామంలో 1500 ఓట్లు ఏక మొత్తంలో గంపగుత్తగా గల్లంతైపోయాయి. మన రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రజత్ కుమార్ గారి గణాంకాల ప్రకారం ఓట్ల గల్లంతు లక్షల్లో ఉంది.

Image result for voters removed from voter list in telangana in huge numbers

అలాంటప్పుడు జరిగినవి పారదర్శక ప్రజస్వామ్యయుత ఎన్నికలా? గెలిచి పాలనలోకి రానున్న శాసనసభ్యులకున్న మాండేట్ లో ధర్మం పాలెంత. కనీసం న్యాయం కొంతైనా ఉందా? నిజంగా ఈ ఎన్నికలలో గెలిచినవారు చట్టబద్ద ప్రాతినిధ్యం ఉన్నవారెలా ఔతారు?

Image result for election commission of telangana 2018

ఓటర్ల జాబితాలో పేర్లు కనిపించనందున ఓటు హక్కు వినియోగించుకోన లేకపోయిన లక్షల మందికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌ కుమార్‌ క్షమాపణ లు చెప్పారు. ఓటు కోల్పోయామన్నబాధను చాలా మంది తనకే స్వయంగా ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారన్నారు.

Image result for voters removed from voter list in telangana in huge numbers

2015లో నిర్వహించిన “ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ -ఐఆర్‌ఈఆర్‌” కార్యక్రమంలో అనేక పొరపాట్లు జరిగాయని, నిబంధనలు పాటించకుండానే అప్పటి రిజిస్టరైన ఓట్లను తొలగించడంతో ఈ సమస్య ఉత్పన్నమైందని అంగీకరించారు. దీంతో ప్రజల చేత ఎన్నుకోబడ్ద ప్రజా ప్రతినిధులకు ఉన్న ప్రాతినిధ్యంలోని నైతికత ప్రశ్నార్ధకం గాదా!

Image result for no of votes missed in telangana voters lists

నిన్న శుక్రవారం పోలింగ్‌ ముగిసిన అనంతరం ఆయన రజత్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా పలుమార్లు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించామని, అయితే వీరెవరూ దరఖాస్తు చేసుకోక పోవడంతో ఓటేయలేక పోయార న్నారు. రెండు నెలల్లో 25లక్షల మంది కొత్త ఓటర్లను జాబితాలో చేర్చామని, జాబితాలో పేరు ఉందో? లేదో? చూసుకోవాలని ప్రచారోద్యమం సైతం నిర్వహించామన్నారు.

Related image

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తాజ్వాల ఓటు తొలగింపుపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారికి ఆదేశించామన్నారు. వ్యక్తిగతంగా గుత్తాజ్వాలకు క్షమాపణలు తెలియజేశారు.

Image result for missed votes voter list in telangana in huge numbers 

ఓటరు జాబితాలో పేర్లను కోల్పోయినవారు మళ్లీ ఓటరుగా దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 26నుంచి 'ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ' కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామ న్నారు. ఈసారి అత్యంత జాగ్రత్తగా ఓటర్ల జాబితా రూపొందిస్తామన్నారు. 2014లో అసెంబ్లీ, పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో 69.5 శాతం పోలింగ్‌ నమోదు కాగా, ఈ సారి 67 శాతం వరకు నమోదైందన్నారు.

Image result for voters removed from voter list in telangana in huge numbers

నూరు పాళ్ళు ఉండాల్సిన ప్రజాప్రాతిధ్యంలోని వాటా - ప్రజలే ఎన్నికలలో పాల్గొనక పోవటం వలన 67శాతానికే పరిమిత మవటం కాగా, దీనికి ప్రధాన కారణం 10శాతం వరకు ప్రజల పేర్లు ఓటర్ల జాబితాలో కనిపించకపోవటం.

Image result for no of votes missed in telangana voters lists

ఈ లోపాన్ని చాలా సులభంగా సవరించవచ్చు. కాని ఓటర్లను జాబితా నుండి తొలగించ టం అత్యంత దుర్మార్గం. ఒక సారి ఓటర్ ఐడి విడుదలయ్యాక ఓటర్ కు తెలియ కుండా జాబితా నుండి పేర్లు తొలగించటం ఎంతవరకు సబబు? స్వల్ప ఆధిఖ్యత చట్టసభల ఎన్నికలలో పోటీ పడే అభ్యర్ధుల అదృష్టాన్ని తలకిందులు చెసే ఈ తరుణంలో ఇలా మాయమైన ఓటర్ల పేర్లు నిజమైన ప్రజాస్వామ్యాన్ని ప్రాతినిధ్యాన్ని ప్రదర్శిస్తుందా? దీనికి శాసన - అధికార - న్యాయస్థానాలు బాధ్యత వహించాలి.

Image result for voters removed from voter list in telangana in huge numbers

ఓటర్ ఓటేయటం అతని చట్టబద్ద బాధ్యతగా మార్చాలి. ఎన్నికల రోజు “పూర్తి చెల్లింపు సెలవు దినం” గా ప్రకటించాలి. కొన్ని కార్యాలయాల్లో ఒక కాలెండర్ సంవత్సరం లో తొమ్మిది సెలవు దినాలుంటే ఆ సంవత్సరం ఒక ఎన్నిక జరిగిందను కుంటే దానితో కలిపి (9 + 1) రోజులు సెలవు ఆ ఉద్యోగి వినియోగించుకునే హక్కు, అలాగే ఎన్నికలో ఓటు చేయాల్సిన ఉద్యోగి భాద్యతను కూడా చట్టపరంగా నిర్ధారణ జరగాలి.

Image result for assembly of Telangana & parliament of India

కొన్ని ప్రయివేట్ కంపనీలు కార్పోరేట్లు ఈ ఎన్నికల సెలవు దినాన్ని కాంట్రిబ్యూటరి సెలవుదినంగా అనధికారికంగా మార్చేసినారని తెలుస్తుంది. నిన్న ఓటేయని ఒక ఐటి ఉద్యోగిని ఎందుకు ఓటేయలేదని ప్రశ్నించినప్పుడు మాకుపేపర్ మీదే సెలవు. కాని సెలవు దినం ఉపయోగించుకున్నందుకు దానికి పరిహారంగా మరో రోజు అనధికారి కం గా మాతో పని చేయించుకుంటారని చెప్పారు. ఇలాంటి సంస్థలపై చట్టబద్ద చర్యలు తీసు కోవటానికి ఆ ఉద్యోగి పిర్యాదు చేయలేని పరిస్థితులుండవచ్చు. అందుకే దీన్ని ఆడిట్ అంశంగా మార్చాలి. ప్రతి ఉద్యోగే కాదు ప్రతి వయోజనుడు ఓటు హక్కు వినియోగించు కునేలా చూసే బాధ్యత ఎన్నికల సంఘానికే ఒప్పగించాలి. 

Image result for assembly of Telangana & parliament of India

ఓటరుగా రిజిస్టర్ అయినందుననే ఓటర్ కార్డు వచ్చింది. అప్పుడు ఓటర్ జాబితాలో పేరు లేకపోతే తప్పెవరిది? అయినా ఓట్లు మాయమవటం ఆ రాష్ట్ర ప్రభుత్వమో లేక ఎన్నికల సంఘమో బాధ్యత వహించాలి - ఇలాటి కేసును న్యాయస్థానం సుమోటోగా తీసుకొని బాధ్యులను పాలకులనైనా అధికారులనైనా - ఎవరి బాధ్యత ఉంటే వారిని శిక్షించాలి.  

Image result for voters removed from voter list in telangana in huge numbers

మరింత సమాచారం తెలుసుకోండి: