తెలంగాణలో ఎన్నికల సందడి ముగిసింది. ఇక ఫలితాల వెల్లడి మిగిలింది. ఒకసారి తెలంగాణ ఎన్నికల పర్వాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే.. తెలంగాణ వారికంటే చంద్రబాబుకే ఈ ఎన్నికల్లో ఎక్కువ ప్రాచుర్యం లభించిందని చెప్పొచ్చు. అసలు తెలంగాణలో కేసీఆర్ కు ఎదురేలేదు అన్న స్థితి నుంచి ఆ పార్టీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డే పరిస్థితి చంద్రబాబు కల్పించారనడంలో అతిశయోక్తి లేదు.

Related image


ప్రజాకూటమి ఏర్పాటు తర్వాతే చప్పగా సాగిన తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన బావమరిది బాలకృష్ణ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. చివరకు పరిటాల సునీత వంటి కొందరు మంత్రులు కూడా ప్రచారం చేశారు. ఇక ఎన్నికల నిర్వహణ కోసం ఆంధ్రా నుంచి తరలివచ్చిన చోటా మోటా నేతలకు కొదవే లేదు.

Image result for lokesh canvas in ghmc elections


ఐతే.. ఒక్క నారా లోకేశ్ మాత్రం ఈసారి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. ఎందుకనో లోకేశ్ ప్రచారం చేయడాన్ని చంద్రబాబు ఇష్టపడలేదు. బహుశా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లోకేశ్ ప్రచారం ఫలించకపోవడం కూడా ఓ కారణం కావచ్చేమో. లోకేశ్ కు తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ తరుపున ప్రచారం చేయాలనే ఉన్నా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


లోకేశ్ ప్రచారం చేయకపోవడంపై సోషల్ మీడియాలోనూ చాలా ప్రచారం జరిగింది. ఒక విధంగా ఇది లోకేశ్ ను చంద్రబాబు అవమానించడమే అనేవారూ ఉన్నారు. లోకేశ్ ప్రచారం చేటు తెస్తుందని చంద్రబాబు భావిస్తే.. బాలయ్యను మాత్రం ఎలా అనుమతించారన్న వాదన కూడా లేకపోలేదు. లోకేశ్ కూడా ప్రచారానికి వచ్చిఉంటే.. ప్రజాకూటమి గెలిస్తే.. ఆ క్రెడిట్ లో ఆయనకూ వాటా ఉండేది.


మరింత సమాచారం తెలుసుకోండి: