తెలంగాణలో మళ్లీ కేసీఆర్ దే అధికారం అని జాతీయ మీడియా ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెబుతున్నాయి. గతంలోనూ పలు సర్వేలు తెలంగాణలో గులాబీ పార్టీదే అధికారమని చాటాయి. ఒక్క లగడపాటి సర్వే తప్ప ఏ సర్వేలోనూ ప్రజాకూటమి గెలుస్తుందని చెప్పలేదు. మరి ఈ సర్వేలన్నీ నిజమై కేసీఆర్ మళ్లీ సీఎం అయితే ఎవరికి మేలు.. ఎవరికి నష్టం.. ?



కేసీఆర్ మళ్లీ సీఎం అయితే ఎవరి సంగతి ఎలా ఉన్నా.. పత్రిక, ఛానల్ ఉన్న ఓ మీడియా యజమాని మాత్రం చాలా ఇబ్బందుల్లో పడే అవకాశం కనిపిస్తోంది. దమ్మున్న ఛానల్ గా చెప్పుకునే ఈ మీడియాపై కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనూ అనధికార నిషేధం అమలైంది. ఆ నిషేధం చాలా నెలలు కొనసాగింది. ఆ తర్వాత మొత్తానికి ఆ పత్రికాధిపతి కేసీఆర్ తో రాజీ కుదుర్చుకుని స్నేహ హస్తం చాచారు.

Related image


ఆ స్నేహం ఎన్నికల ముందు వరకూ కొనసాగింది. కానీ ఆ యెల్లో మీడియాగా పేరున్న ఆ పత్రికాధిపతికి కేసీఆర్ కంటే చంద్రబాబు అంటేనే మక్కువ ఎక్కువ. ఇష్టంగా చంద్రబాబుకు.. కష్టంగా కేసీఆర్ కూ ఆయన భజన చేస్తుంటారని మీడియా వర్గాల్లో చెప్పుకుంటారు. సరిగ్గా చంద్రబాబు ప్రజాకూటమి ఏర్పాటులో చురుగ్గా ఉన్ననాటి నుంచి ఆ పత్రికాధిపతి క్రమంగా యాంటీ కేసీఆర్ స్టాండ్ తీసుకున్నారు.

Related image


ప్రజాకూటమికి అనుకూలంగా ప్రచారం ప్రారంభించారు. తనదైన సంపాదకీయాల్లో కారు కింద భూమి కదిలిపోతోందని రాసుకొచ్చారు. అంతే కాదు.. చంద్రబాబు డైరక్షన్‌లోనే ఆ పత్రికాధిపతి, లగడపాటి రాజగోపాల్ ప్రజాకూటమిదే గెలుపంటూ పోలింగ్‌కు నాలుగైదు రోజుల నుంచి బాకా ఊదుతున్నారని స్వయంగా కేటీఆర్, కేసీఆర్ ఆరోపించారు. తమ పరాజయం కోసం చివరి వరకూ పోరాడిన ఆ మీడియాను మళ్లీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ఉపేక్షిస్తారా అంటే ఏమాత్రం క్షమించకపోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: