తెలంగాణా ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తారు?  ఎవ‌రు నిలుస్తారు? వ‌ంటి కీల‌క అంశాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ఎన్నిక‌లు ముగి సినా.. ఫ‌లితాల వెల్ల‌డికి మూడు రోజుల స‌మ‌యం ఉండ‌డంతో నేత‌ల‌కు న‌రాలు తెగుతున్నాయి. ఈ మూడు రోజులు ఎలా గ‌డుస్తాయా? అని త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే వెలువ‌డిన ఎగ్జిట్ పోల్స్‌ను చూసిన త‌ర్వాత ఈ ఉత్కంఠ మ‌రింత పెరిగిపోయింది. దీంతో అప్ప‌టి వ‌ర‌కు కూడా తెలంగాణాలో ఫ‌లితం ఏకపక్షంగా ఉంటుంద‌ని భావించిన వారంతా ఇప్పుడు ఏం జ‌రుగుతుంది? అనే విధంగా ఆలోచ‌న‌కు దిగారు. దీంతో హంగా లేక కేసీఆర్ ఎవ‌రు వ‌స్తారు? అనే చ‌ర్చ జోరందుకుంది.


 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాని పరిస్థితి ఏర్పడితే పోలింగ్‌కు ముందే పొత్తు కుదుర్చుకున్న కూటమికి ఎక్కువ సీట్లు వచ్చినట్టయితే వారినే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సి ఉంటుంది. ఈ విషయంలో అతి పెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్‌ ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతోంది. అదే జరిగితే ఏ పార్టీనిప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానిస్తారనే చర్చ జరుగుతున్నది.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి 51 సీట్లు, ప్రజాఫ్రంట్‌కు 52 సీట్లు (కాంగ్రె్‌సకు 48 సీట్లు, టీడీపీకి 4 సీట్లు ) వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసే మొదటి అవకాశాన్ని ఫ్రంట్‌కే ఇవ్వాల్సి ఉంటుంది. అతిపెద్ద పార్టీగా టీఆర్‌ఎస్‌ నిలిచినా ఎక్కువ సీట్లు వచ్చిన ప్రజాఫ్రంట్‌కే అవకాశం కల్పించాల్సి ఉంటుంది.


దీంతో ఒక్క‌సారిగా తెలంగాణాలో చ‌ర్చ హంగ్‌పై మళ్లింది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో కేసీఆర్‌కు అనుకూలంగా మారు తుంద‌ని నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు లెక్క‌లు గ‌ట్టినా.. ఇప్పుడు మాత్రం తాజాగా వ‌చ్చిన ఎగ్జిట్ పోల్స్ విష‌యంపై త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు మొద‌ల‌య్యాయి. నిజానికి హైద‌రాబాద్ వంటి కీల‌క‌మైన నాలుగు న‌గ‌రాల్లో పోలింగ్ శాతం పెరిగి ఉంటే., అదేవిధంగా రాష్ట్రంలో హంగ్‌కు అవ‌కాశం ఉండేద‌నే వ్యాఖ్య‌లు మేధావుల నుంచి వినిపిస్తున్నాయి. ఇక‌, ప్ర‌స్తుతం జ‌రిగిన పోలింగ్ విధానాన్ని గ‌మ‌నిస్తే.. గ్రామీణ ఓట‌ర్లు భారీ ఎత్తున వ‌చ్చి ఓట్లేశారు కాబ‌ట్టి.. రాష్ట్రంలో హంగ్ వ‌చ్చే అవ‌కాశం లేద‌ని మ‌రికొంద‌రి భావ‌న‌. అంతే కాదు టీఆర్ఎస్ మరోసారి విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరంటున్నారు.  ఇలా ఎలా ఉన్నా.. రాష్ట్రంలో ఎన్నిక‌ల ఫ‌లితంపై మాత్రం తీవ్ర‌మైన ఉత్కంఠ రాజ్యమేలుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: