నేత‌ల త‌ల‌రాత‌లు మారుతున్నాయి. తెలంగాణాలో ప్ర‌జ‌ల తీర్పు బాక్సుల‌లో నిక్షిప్త‌మైంది. ఎవ‌రు కింగు.. ఎవ‌రు బొంగు ..అనే విషయాలు మంగ‌ళ‌వారం తెర‌మీదికి రానున్నాయి. ఎవ‌రికి వారు ఊహ‌ల‌ప‌ల్ల‌కిలో తేలుతున్న ఈ త‌రుణంలో ప్ర‌తి ఒక్క‌రూ గెలుపు నాదంటే.. నాద‌ని చెప్పుకొంటున్నారు. స‌రే! ఏది ఎలా ఉన్నా.. ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా వ్యాఖ్య‌లు చేసుకున్నా.. ప్ర‌జా తీర్పు మాత్రం మంగ‌ళ‌వారం బ‌ద్ద‌లు కానుంది. అయితే, కేసీఆర్ కూట‌మి నేత‌ల్లో ఎంద‌రు గెలుస్తారు? అనేది ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కేబినెట్ మంత్రుల్లో కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితులుగా మెలిగిన వారిలో  ఐదుగురు ఉన్నారు. అజ్మీర చందూలాల్, జ‌గ‌దీష్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, మహేంద‌ర్ రెడ్డి, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిలు ఓట‌మికి చేరువ‌గా ఉన్నార‌ని తెలుస్తోంది. 


నిజానికి ఎన్నిక‌ల్లో వ్యూహాత్మకంగా వ్య‌వ‌హ‌రించి అధికారంలోకి రావాల‌ని ప్ర‌ధాన పార్టీలు అన్న ప్ర‌య త్నించాయి. ఈ క్ర‌మంలోనే ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపు వ్యూహంపై దృష్టి పెట్టాయి. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త త‌మ‌కు లాభిస్తుంద ని మ‌హాకూట మి నాయ‌కులు లెక్క‌లు వేశారు., ఇక‌, ప్ర‌భుత్వం అమ‌లు చేసిన కార్య‌క్ర‌మాలు త‌మ‌కు  గెలుపు గుర్రాలు అవుతాయ‌ని అధికార పార్టీ నాయ‌కులు, మంత్రులు లెక్క‌లు గ‌ట్టారు. వెర‌సి అత్యంత ఉత్కంఠ‌గా సాగిన ఈ పోరు అంతే ఉత్కంఠ‌తో నాయ‌కుల‌ను మంగ‌ళ వారం వ‌ర‌కు వెయిట్ చేయిస్తోంది. ఇదిలావుంటే,  పోలింగ్‌కి ఓ వారం పదిరోజుల ముందు నుంచే ఒకరిద్దరు మంత్రులు ఓడిపోవచ్చంటూ లీకులు రావడం గమనార్హం.  ఇక‌, ఈ సంఖ్య ఎన్నిక‌ల ముగిసిన త‌ర్వాత కి ఐదుకు చేరింది. 


ఆ ఐదుగురు మంత్రులలో ములుగు నుంచి ప్రాతినిధ్యం వ‌హించిన‌ అజ్మీరా చందూలాల్, సూర్యాపేట  నుంచి ప్రాతిని ధ్యం వ‌హించిన జ‌గ‌దీష్‌ రెడ్డి, అదేవిధంగా తాండూరు నుంచి మ‌హేంద‌ర్‌రెడ్డి పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. ఇక‌,హైద‌రాబాద్ న‌డిబొ డ్డున ఉన్న స‌న‌త్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన తాజా మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్‌కూడా  ఏటికి ఎదురీదుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అదేవిధంగా నిర్మల్ లో ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఓడిపోతున్నా ర‌నే ప్ర‌చారం ఊపందుకుంది. ఈ ప‌రిణామాల‌తో టీఆర్ ఎస్ అభ్య‌ర్థుల్లోనూ కొంత మేర‌కు అల‌జ‌డి చోటు చేసుకుంది. హేమా హేమీలైన నాయ‌కులు ఓట‌మి పాల‌వ‌డం అంటే ఒక‌ర‌కంగా కేసీఆర్ కు మ‌చ్చ‌ప‌డుతున్న‌ట్టే అంటున్నారు విశ్లేష‌కులు., మ‌రి ప్ర‌జా మ‌ద్ద‌తు ఎలా ఉందో చూడాలి. ఏది ఏమైనా తెలంగాణా ఎన్నిక‌లు మాత్రం ఎన్న‌డూలేని ఉత్కంఠ‌కు తెర‌దీయ‌డం గ‌మ‌నార్హం. 



మరింత సమాచారం తెలుసుకోండి: