ఆ మద్య విజయవాడలో అర్థరాత్రి తాంత్రిక పూజలు నిర్వహించినట్లు వార్తలు రావడంతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కి పడ్డాయి.  ఓ వైపు టెక్నాజీ రంగం ముందుకు సాగుతుంటే..ఇలాంటి తాంత్రిక పూజలు అందునా భక్తులు ఎంతగానో విశ్వసించి దుర్గామాత గుడిలో జరగడం తీవ్ర సంచలనం రేకెత్తించాయి.  ఈ సంఘటన మరువకముందే విశాఖపట్నం సింహాచలం శ్రీలక్ష్మి నరసింహస్వామి అనుబంధ ఆలయంలో తాంత్రిక పూజల కలకలం చెలరేగింది. సింహాచలం క్షేత్రపాలకుడిగా ఉన్న భైరవస్వామి ఆలయంలో ఇద్దరు ఆలయ పూజారులు స్వయంగా ఈ తాంత్రిక పూజల్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. 
Image result for తాంత్రిక పూజ
నిన్న అమావాస్య సందర్భంగా కొంత మంది మాంత్రికులు అమాయక జనాలను మోసం చేస్తూ వారికి కీడు తొలగిపోతుందని నమ్మించి తాంత్రిక పూజలు నిర్వహించారు.  ఈ క్రమంలో గురువారం (అమావాస్య రోజు) అర్ధరాత్రి ఆలయ ఈవో ఆదేశాల మేరకే ఈ క్రతువును నిర్వహించినట్లు సమాచారం. అడవివరానికి 4 కి.మీ దూరంలో భైరవస్వామి ఆలయం ఉంది. ఈ స్వామికి కొందరు అర్చకులు అమావాస్య రోజున మద్యంతో అభిషేకం నిర్వహించడంతో పాటు ఇక్కడ పూజలు నిర్వహించారని భక్తులు తెలిపారు. 
Image result for తాంత్రిక పూజ
అయితే భక్తులు ఎంతో విశ్వాసంతో కొలిచే ఇలాంటి ఆలయాల్లో క్షుత్రపూజలు నిర్వహించడం పై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  దాంతో ఆ పూజలు ఆపడానికి ప్రయత్నించగా..ఈవో ఆదేశాలతోనే తాము ఈ పూజలు నిర్వహిస్తున్నామనీ, మరికాసేపు ఆగాలని వారు సూచించారని భక్తులు వాపోయారు. కాగా, ఈ తాంత్రిక పూజల వ్యవహారంపై ఈవోను సంప్రదించేందుకు యత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: