సాధారణంగా రాజకీయాల్లో సినీ నటుల రంగ ప్రవేశంతో కొత్త ఊపు వస్తుందటారు. ఇప్పటికే పలువురు నటీ, నటులు రాజకీయాల్లో ప్రవేశించి తమ సత్తా చాటుతున్నారు.   తాజాగా బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ 2019 పార్లమెంటు ఎన్నికల్లో పూణే స్థానం నుంచి పోటీ చేయించడానికి బీజేపీ అధిష్ఠానం ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ లో మాధురితో సమావేశమైన బీజేపీ చీఫ్ అమిత్ షా పూణే పార్లమెంటు స్థానానికి పోటీ చేసే విషయమై ఆమెతో చర్చించినట్లు వార్తలు వచ్చాయి.
Image result for madhuri dixit bjp clarity
ఈ వార్తలు కాస్త వైరల్ కావడంతో నటి మాధురీ దీక్షిత్ స్పందించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తాను బీజేపీ టికెట్ పై పోటీ చేయబోవడం లేదని తేల్చిచెప్పింది. తన రాజకీయ ప్రవేశంపై మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలన్నీ వదంతులేనని స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలు ఎలాంటి స్పష్టత లేకుండా మా ప్రమేయం లేకుండా ఎలా వస్తాయో ఆశ్చర్యం వేస్తుందని ఆమె అన్నారు.  కాగా, ఈ సంవత్సరం బీజేపీ ప్రభుత్వానికి మద్దతు కూడగట్టడంలో భాగంగా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా  వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ అయ్యారు.
Image result for madhuri dixit bjp clarity
ఈ నేపథ్యంలో నటి మాధురీ దీక్షిత్ ని కలిసి  గత నాలుగేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను వారికి వివరించారు.  దాంతో మాధురీ దీక్షిత్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి.  అంతే కాదు బీజేపీలో ఓ సీనియర్ నేత మాధురీ దీక్షిత్ కు పూణే టికెట్ ను పార్టీ హైకమాండ్ ఖరారు చేసిందని తెలిపారు.  ఈ వార్తలు కాస్త వైరల్ కావడంతో మాధురీ దీక్షిత్ మీడియాతో తన రాజకీయ ప్రవేశంపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: