ఎన్నికల సంఘం అనేక విషయాల్లో విఫలమైందని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో దొర్లిన పొరపాట్లపై సాక్షాత్తూ ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమారే క్షమాపణలు చెప్పారని గుర్తుచేశారు. ప్రజాకూటమి 75 నుంచి 86 స్థానాలు గెలుచుకుంటుందని ఉత్తమ్‌ కుమార్ ధీమా వ్యక్తంచేశారు. శనివారం (డిసెంబర్ 8) మధ్యాహ్నం ఆయన గోల్కొండ హోటల్‌లో కూటమి భాగస్వామ్య పక్షాల నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. 
Image result for telangana election commission 2018
ఓట్ల లెక్కింపు సందర్భంలో పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఉత్తమ్ కుమార్ కోరారు. ఈవిఎం ఉంచే స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రతపై అనుమానం వ్యక్తం చేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌ను ఒకసారి లాక్‌ చేసిన తర్వాత అధికారులు ఎవరూ వెళ్లకూడదని, అయినా కొందరు లోపలకు వెళ్తున్నారనే సమాచారం తమకు అందిందన్నారు. అందువల్ల ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు అక్కడ ఉండేవిధంగా అనుమతి ఇవ్వాలని కోరారు. 
tpcc chief uttam kumar reddy suspects ec over evms safety
ఈవీఎంల తరలింపు, భద్రత విషయంలో ఉత్తమ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. అవకతవకలు జరుగుతాయని కొందరికి అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈవీఎంలు మారవచ్చనే అనుమానాలు కూడా తమకు ఉన్నాయని చెప్పారు. స్ట్రాంగ్‌-రూమ్‌ లను కార్యకర్తలు, నేతలు పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. ఓటరు జాబితా లను సరి చేయకుండా ఎవరి కోసం ఇంత తొందరగా ఎన్నికలు నిర్వహించాల్చి వచ్చిందని ఉత్తమ్ కుమార్ ప్రశ్నించారు. వేలాది మంది ప్రజల ఓట్లు గల్లంతయ్యాయని మండిపడ్డారు.
Related image
పోలింగ్ బూత్‌ ఏజెంటే కౌంటింగ్‌ ఏజెంట్‌ గా ఉంటే బాగుంటుందని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. ఉత్తం కుమార్ రెడ్డి చెప్పిందే నిజమైతే ఎన్నికల సంఘం నేరం చేసినట్లే. ఓటర్ల జాబితాలు తప్పుల తడకలు వాటిని సవరించకుండా ముందస్తుగా ఎన్నికలు జరపటం మహా నేరం. ఓటర్ల జాబితా నుంచి లక్షల్లో ఓటర్ల పేరు మాయమై పోవటం మొత్తం తెలంగాణా జనావళి గుర్తించి కోడై కూస్తుంది. ఆ విషయంలొ ఉత్తం కుమార్ రెడ్డి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాం అంటూ జనం చెపుతున్నారు. 



ఎగ్జిట్‌-పోల్స్ ఫలితాల్లో బీజేపీకి అనుకూలమైన కొన్ని న్యూస్-ఛానళ్లు టీఆర్‌ఎస్ అనుకూలంగా చెప్పాయని ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. 100 పైగా స్థానాలు గెలుస్తా మంటున్న తండ్రి కొడుకులు కేసీఆర్‌, కేటీఆర్‌ ఇప్పుడు టీఆర్‌ఎస్‌ కు 80 సీట్లు మాత్రమే వస్తాయని అంటున్నారని, ఓట్ల లెక్కింపు తర్వాత వారికి 35 కి మించి రావని చెప్పారు. కేసీఆర్‌ కుటుంబంపై తెలంగాణా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. 



ఎన్నికల పోలింగ్‌ లో భాగస్వాములై, సహకరించిన కార్యకర్తలకు, ప్రజలకు ఉత్తమ్ కుమార్ ధన్యవాదాలు చెప్పారు. ప్రజాస్వామ్యానికి, సామాన్య ప్రజల హక్కులను కాపాడేం దుకే తామంతా ఒక్కటయ్యామని ప్రజాకూటమిని ఉద్దేశించి చెప్పారు. ప్రజాకూటమి నేతలు, కార్యకర్తలు ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. ప్రజాకూటమి పార్టీల మధ్య ఓటుబదిలీ జరిగిందని చెప్పారు. 
Image result for uttam kumar reddy from golkonda hotel
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ప్రజాకూటమి విజయంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమ కూటమి 75 నుంచి 86 స్థానాలు గెలుచు కుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. శనివారం మధ్యాహ్నం ఉత్తమ్ కుమార్ గోల్కొండ హోటల్‌ లో ప్రజాకూటమి నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. 12 న తమ ప్రభుత్వం ఏర్పడ బోతుందని జోస్యం చెప్పారు. 
Related image
ఎగ్జిట్‌-పోల్ ఫలితాల్లో కొన్ని బీజేపీ అనుకూల ఛానళ్లు టీఆర్ఎస్‌కు అనుకూలంగా చెప్పాయని ఆరోపించారు. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ చూసి కంగారుపడొద్దని, సర్వేల ను నమ్మొద్దని తనకు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ఫోన్‌ లో చెప్పారని ఉత్తమ్ వెల్లడించారు. తాము వేస్తున్నట్టు ఫలితాలు ఉండవని రాజ్‌దీప్ సర్దేశాయ్‌ ఫోన్‌ లో చెప్పినట్టు తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని, టీడీపీతో పొత్తు గ్రేటర్‌ లో కలిసొచ్చిందన్నారు. గడ్డం తీసేసే సమయం దగ్గర పడిందని ఉత్తమ్ కుమార్ అన్నారు.

Image result for uttam kumar reddy from golkonda hotel

మరింత సమాచారం తెలుసుకోండి: