ఎన్నిక‌ల కురుక్షేత్రాన్ని త‌ల‌పించిన తెలంగాణా ఇప్పుడు ప్ర‌శాంతంగా ఉంది. అయితే, అంతే స్థాయిలో ఉత్కంఠ‌ను కూడా ఎదుర్కొంటోంది. ప్ర‌జా తీర్పును నిక్షిప్తం చేసిన ఎన్నిక‌ల ఏవీఎంల‌పైనే అంద‌రి నాయ‌కుల దృష్టీ ఉంది. ఎవ‌రు గెలుస్తారు?  ఎవ‌రు ఓడిపోతారు?  ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారు?  ఎవ‌రు ప్ర‌తిప‌క్షంలో కూర్చుంటారు?  ఏ న‌లుగురు క‌లిసినా.. తెలంగాణా చౌర‌స్తాలు చ‌ర్చ‌ల‌తో అట్టుడుకిపోతున్నాయి. నాయ‌కులు ఎవ‌రికివారే ధీమాగా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు భిన్నంగా ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల‌పై స‌ర్వే సంస్థ‌ల‌కు కూడా ప్ర‌జానాడి అంద‌లేద‌న్న‌ది మ‌రోటాక్‌. ఇలా మొత్తంగా తెలంగాణా అంత‌టా ఓ విధ‌మైన ఉత్కంఠ రాజ్య‌మేలుతోంది. ఇక‌, ట‌ఫ్ ఫైట్ త‌ప్ప‌ద‌ని తెలిసిన కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులకు బీపీ క్ష‌ణ క్ష‌ణానా మారిపోతోంది. మాదంటే మాదేన‌ని సీఎం సీటుపై రెండు ప్ర‌ధాన పార్టీలూ చ‌ర్చ‌లు చేస్తున్నాయి. 

అధికార పార్టీ టీఆర్ ఎస్ నాయ‌కులు ధీమాగా ఉండ‌గా.. ప్ర‌జాకూట‌మిగా ఏర్ప‌డిన టీడీపీ-కాంగ్రెస్‌-సీపీఐ-టీజేఎస్‌లోనూ ఇదే విధమైన ధీమా వ్య‌క్త‌మవుతున్నా.. ఎక్క‌డో జాతీయ స‌ర్వే సంస్థ‌ల రిపోర్టులు మాత్రం క‌ల‌వ‌ర పెడుతున్నాయి. ఎన్నిక‌లు ముగిసిన అర‌గంట‌లోనే జాతీయ మీడియా సంస్థ‌లు, స‌ర్వే సంస్థ‌లు వారు చేసిన ఎగ్జిట్ పోల్ స‌ర్వేల‌ను వెల్ల‌డించాయి. విచిత్రం ఏంటంటే.. ఏ జాతీయ మీడియా కూడా ప్ర‌జాకూట‌మికి అనుకూలంగా రిజ‌ల్ట్‌ను ఇవ్వ‌క‌పోవ‌డ‌మే! అన్ని సంస్థ‌లూ ఒక‌టి రెండు లేదా ప‌ది స్థానాల తేడాతో అధికార పార్టీ టీఆర్ ఎస్ తిరిగి అధికారంలోకి వ‌స్తుంద‌నే విష‌యాన్ని స్ప‌ష్టం చేశాయి. దీంతో రాష్ట్రంలో ఓ క్లారిటీ వ‌చ్చింద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే, ఇంత‌లోనే ఆంధ్రా ఆక్టోప‌స్‌గా పేరు తెచ్చుకున్న మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ వెల్ల‌డించిన స‌ర్వే ఫ‌లితాలు ఒకింత సందేహాన్ని వ్య‌క్తం చేశాయి. ఆయ‌న వెల్ల‌డించిన స‌ర్వేలో కాంగ్రెస్‌తో కూడిన మ‌హాకూట‌మికి ఎక్కువ మార్కులు ప‌డ్డాయి. 

టీఆర్ ఎస్ కూట‌మి కేవ‌లం 35 నుంచి 37 సీట్ల‌లో మాత్ర‌మే గెలుస్తోంద‌ని, ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఎక్కువ‌గా ఉంద‌ని రాజ‌గోపాల్ చెప్పుకు రావ‌డంతో ఇప్పుడు అంద‌రిలోనూ ఒక‌విధ‌మైన ఉత్కంఠ రాజ్య‌మేలుతోంది. ఈ క్ర‌మంలోనే ఎవ‌రికి వారు ధీమాగా ఉన్నారు. అయితే, రాజ‌గోపాల్ చివ‌రిగా చెప్పిన మ‌రో మ‌రింత ఉత్కంఠ‌గా మారింది. జాతీయ‌స్థాయిలో నాలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల‌కు సంబంధించి జాతీయ మీడియా సంస్థ‌లు ఇచ్చిన స‌ర్వే నిజ‌మేన‌ని .. అక్క‌డ అలాంటి ఫ‌లిత‌మే వ‌స్తుంద‌ని ఆయ‌న చెప్పారు. అయితే, తెలంగాణా విష‌యంలో మాత్రం తాను చెప్పిందే జ‌రుగుతుంద‌ని అంటూనే ఏమైనా మారుతుందేమో.. మ‌ళ్లీ చెబుతాన‌ని అన‌డంతో మ‌ళ్లీ నేత‌లు బిక్క‌మొహం వేశారు. ఏదిఎలా ఉన్నా.. నాయ‌కులు మాత్రం కొంత గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఎవ‌రికి వారు గెలుపు గుర్రం పై ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. 

Image result for ktr

టీఆర్ ఎస్‌లో నెంబ‌ర్‌-2 నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తామంతా ఆత్మ విశ్వాసంతో ఉన్నామన్నారు. ఫలితాలన్నీ పాజిటివ్‌‌గా ఉండబోతున్నాయని, ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కంటే ఎక్కువగా 100 సీట్లు రాబోతున్నట్లుగా అంచనా వేస్తున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రత్యర్థులకే భయమేసి కుంటుసాకులు వెతుక్కుంటున్నారని తెలిపారు. జిల్లాల్లో కాంగ్రెస్ హేమాహేమీలందరూ భయపడ్డారన్నారు. సీఎం అభ్యర్థులమంటూ చెప్పుకున్న వాళ్లే నియోజకవర్గం దాటి ప్రచారం చేయలేదంటేనే అర్థం చేసుకోవచ్చాన్నారు. ఓటమి భయంతో కూటమి నేతలు చివరిలో చంద్రబాబు ఫొటో తీసేశారని గుర్తుచేశారు. ఇక‌, లగడపాటి రాజగోపాల్ చెప్పిందంతా సోది అని కేటీఆర్ కొట్టిపారేశారు. కాగా, ప్రజాకూటమిని తెలంగాణ ప్రజలు ఆదరించబోతున్నారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ చెప్పారు. 

Image result for uttam kumar reddy

ఇచ్చిన హామీలను కేసీఆర్‌ నెరవేర్చలేదని తెలిపారు. దురుద్దేశంతోనే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు.  లగడపాటి రాజగోపాల్ సర్వేతో తాము పొంగిపోలేదని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. . ఓట్లు, సీట్ల కోసం టీడీపీ పనిచేయదని, ప్రజల కోసమే పనిచేస్తామని రావుల స్పష్టం చేశారు. గెలిచే స్థానాల్లోనే పోటీ చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారని, ఓట్లు, సీట్లు ముఖ్యం కాదు.. ప్రజాస్వామ్య పరిరక్షణే ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ ఎప్పుడూ ఆధారపడలేదని, కాంగ్రెస్ పార్టీ ప్రజల నాడిని నమ్మిందని కాంగ్రెస్ నేత మధుయాష్కీ అన్నారు. భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నానని మాజీమంత్రి, కాంగ్రెస్ నాయ‌కుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగా ప్రజలు ప్రజాకూటమిని గెలిపించేందుకు ఎక్కువగా ఓట్లు వేశారని అన్నారు.

ఇక‌, ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత మీడియాతో మాట్లాడ‌తాన‌ని, ఎన్నిక‌ల‌పై త‌న వివ‌ర‌ణ కూడా ఇస్తాన‌ని ఎన్నిక‌ల‌కు ఒక‌రోజు ముందు హైద‌రాబాద్‌లో వెల్ల‌డించిన ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా వెల్ల‌డైన స‌ర్వే ఫ‌లితాల అనంత‌రం ఆయ‌న ఎక్క‌డా కూడా తెలంగాణా ఎన్నిక‌ల‌పై ఒక్క మాట కూడా మాట్లాడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీనిపై కూడా పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. అధికార టీఆర్ ఎస్ త‌ర‌ఫున కేటీఆర్ మీడియా ముందుకు వ‌చ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ త‌ర‌ఫున ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కూడా ఎన్నిక‌లు ముగియ‌గానే మీడియా ముందుకు వ‌చ్చారు. ఇక‌, కాంగ్రెస్ తెలంగాణా అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కూడా మీడియా ముందుకు వ‌చ్చాడు. కానీ, తెలంగాణాలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు వ‌స్తాను. మ‌హాకూట‌మి విజ‌యం సాధించేలా చ‌క్రం తిప్పుతాన‌ని చెప్పిన చంద్ర‌బాబు మాత్రం ఎన్నిక‌లు ముగిసిన 24 గంట‌ల త‌ర్వాత కూడా ఒక్క‌మాట మాట్లాడ‌లేదు. 

Image result for telangana elections

దీనిని బ‌ట్టి తెలంగాణా ఎన్నిక‌ల స‌ర‌ళి ఆయ‌న‌కు బాగానే అర్ధ‌మై ఉంటుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఇక‌, మ‌హాకూట‌మిలో మ‌రోనేత‌, మేధావి వ‌ర్గానికి నాయ‌కుడు, ప్రొఫెస‌ర్, తెలంగాణా జ‌న‌స‌మితిపార్టీ అధినేత కోదండ‌రాం కూడా ఇప్ప‌టి వ‌ర‌కు మీడియా ముందుకు రాలేదు. ఎన్నిక‌ల స‌ర‌ళిని గ‌మనించాక మా గురించి చెబుతాన‌ని ఈయ‌న కూడా ఎన్నిక‌ల‌కు ఒక‌రోజు ముందు వెల్ల‌డించారు. మ‌రి ఇప్పుడు మాత్రం ఎగ్జిట్ పోల్స్ త‌ర్వాత వీరిలో ఏ ఒక్క‌రూ ముందుకు రాలేదు. దీనిని బ‌ట్టి ప‌రిస్థితి తీవ్రంగా ఉంద‌నే విష‌యం అర్ధ‌మ‌వుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు మీడియా ముందుకు వ‌చ్చిన  వారిలో ఎవ‌రికి వారు ఓటింగ్‌పై ధీమా వ్య‌క్తం చేశారు. అయితే, అంద‌రూ కూడా మంగ‌ళ‌వారం నాటి ఎన్నిక‌ల ఫ‌లితాల కోసం వెయ్యి క‌ళ్ల‌తో అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి గెలుపు గుర్రం ఎవ‌రు ఎక్కుతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: