అంతా ఊహించినట్లుగానే తెలంగాణాలో భారీ పోలింగే జరిగింది. దాదాపుగా 76.5 శాతం పోలింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. అధికారికంగా చెప్పకపోయినప్పటికీ పోలింగ్ ఇలాగే జరిగిందని అంటున్నారు. ఎన్నికల సంఘం  వద్ద ఉన్న వివరాలన్నీ ఇపుడు క్రోడీకరించుకునే పనిలో పడ్డాయి. రూరల్ ఏరియాలో ఎక్కువ పోలింగ్ జరగడమే కాదు. ఈసారు సరి కొత్త రికార్డును  స్రుష్టించారని  చెప్పాలి.


అనూహ్యమే :



లగడపాటి రాజగోపాల్ చెప్పినట్లుగా పోలింగ్ ఎక్కువ శాతం జరిగితే ఎవరికి లాభం అన్నది కూదా ఇపుడు కొత్త లెక్క మొదలైంది. నిజానికి నిన్న (శుక్రవారం) ఎన్నికలు జరిగిన రాజస్థాన్లో కూడా పోలింగ్ ఇంత పెద్ద ఎత్తున రాలేదు. అంతకు ముందు ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్లో కూడా పోలింగ్ చూసినా, చతీస్ ఘడ్ లో పోలింగ్ జరిగిన తీరు చూసినా కూడా ఈ నంబర్ రాలేదు. మరి తెలంగాణాకు ఎందుకింత నంబర్ వచ్చింది. దానికి గల కారణాలు పక్కన పెడితే జనం ఎందుకింతలా స్పందించారన్నది ఇపుడు అందరి మదిలో మెదిలో ప్రశ్నగా ఉంది.


ఎవరికి  లాభం :


ఈసారి పోలింగ్ ఎక్కువ శాతం జరిగింది. ఎవరికి లాభం అన్నది కనుక విశ్లేషణ్  చేస్తే మాత్రం భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. టీయారెస్ కి అనుకూలంగా పోలింగ్ జరిగిందని అంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలు బాగా జరిగాయి కాబట్టి పోలింగ్ ఎక్కువగా జరిగిందని, తాము నూటికి నూరు స్థానాలు గెలుచుకుంటున్నామని టీయారెస్ వర్గాలు అంటున్నాయి. 

అయితే ఎక్కువ పోలింగ్ ఎపుడు విపక్షానికే మేలు చేస్తుంది కాబట్టి తమకే గెలుపు అవకాశాలని ప్రజా కూటమి నాయకులు చెబుతున్నారు. అయితే ప్రలోభాలు ఈసారి ఎక్కువగా ఉన్నాయి, అలాగే అన్ని పార్టీలు విచ్చవిడిగా డబ్బులు ఖర్చు చేశాయి కాబట్టి జనం వెల్లువలా వచ్చి ఓటు వేశారన్న మాట కూడా వినిపిస్తోంది. మరి ఇవన్నీ తేలాలంటే మాత్రం ఈ నెల 11 వరకూ ఎదురుచూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: