తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీలు చేతులు కలిపాయి. చంద్రబాబు తన పార్టీ ప్రతిష్ట ఫణంగా పెట్టారు. దశాబ్దాల జన్మ వైరాన్ని ఆ రెండు పార్టీలూ పక్కన పెట్టాయి. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ చేవ లేక చచ్చుపడి పోయినా - తెలంగాణలో అది ఎంతో కొంత పదిలంగా ఉన్నా, కాంగ్రెస్ నేతలు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల పాటు తెలుగుదేశం నాయకుడు చంద్రబాబుకు, టిడిపికి వ్యతిరేకంగా తమ కార్యకలాపాలు కొనసాగించి ఒకరి పతనం కోసం మరొకరు కృషి చేసిన చరిత్ర వారిది.

Image result for chandrababu rahul gandhi maitri

దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కంచు కోట బ్రద్దలు చేయటానికే పుట్టిన తెలుగుదేశం పార్టీ అంటే కాంగ్రెస్ కు విపరీతమైన కడుపుమంట. అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగు దేశం పార్టీతో చంద్రబాబుతో కూడా పోరాడిన నేపథ్యం ఉంది. ఇలాంటి తీరున్న వీరు ఇప్పుడు తెలంగాణాలో ప్రజాకూటమి అనే గొడుగు కిందకు టిడిపి, తన నూతన మిత్రుడు కాంగ్రెస్ తో కలిపి మరో రెండు టిజేఎస్, సిపీఐ పార్టీలను తెచ్చి ఒక కలగూర గంప ఏర్పాటు చేశారు.

Related image

వీరిది సిద్ధాంత బంధం కాదు తెలుగుదేశం తెలుగువారి ఆత్మాభిమానం ఆత్మగౌరవం డిల్లిలో తాకట్టు పెట్టిన కాంగ్రెస్ వారికి వ్యతిరేఖంగా పుట్టింది. అలాగే తెలంగాణా జన సమితి తెలుగుదేశం పార్టీని సీమాంధ్రులను తెలంగాణా నుండి పారద్రోలటమే దాని ద్యేయంగా పోరాడి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అయ్యేవరకు నిద్రపోలేదు. అలాంటిది ఇప్పుడు టిడిపి తో పొత్తులో బాగం పంచుకోవటం చిత్రాతి చిత్రం. ఇక సిపీఐ పూర్తి వామపక్ష శక్తి వీరితో స్నేహం చెయ్యటానికి ఏమాత్రం వీలుకానిది. కానిది ఈ నాలుగు వ్యతిరేఖ శక్తులు టిఆరెస్ అనే ఏకైక శత్రువును పదవి నుండి దింపటానికి చేతులు కలిపాయి. 
Image result for chandrababu rahul gandhi maitri
అసలు కాంగ్రెస్ కు ఎన్నికల ముందు నాటికే ఆ సామర్ధ్యం ఉంది. కాంగ్రెస్ సామర్ధ్యాన్ని గుర్తించి రాహుల్ గాంధి అసమర్ధతను అడ్డుపెట్టుకొని సోనియా గాంధికి సంభంధం లేకుండా కాంగ్రెస్-టిడిపి మైత్రికి పునాదులు వేశారు చంద్రబాబు. దీనివెనుక బిజెపి శక్తి నుండి తన తనవారి అక్రమ సంపాదనను కాపాడుకోవటం ఏకైక లక్ష్యం గా చెపుతారు విశ్లేషకులు. దశాబ్దాల పాటు జనాలను ఫూల్స్ చేసిన వీరు నేడు తెలంగాణాలో ఒకటిగా ఉంటే మాత్రం ప్రజలు హర్షిస్తారా? అని అంటున్నారు తెలంగాణా వాసులు.

Image result for uttam kumar reddy chandrababu

కాంగ్రెస్ రెబల్ ఇండిపెండెంట్ అభ్యర్ధికి మల్రెడ్డి రంగారెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ రాష్ట్ర సారధి ఉత్తం కుమార్ రెడ్ది ప్రజాకూటమి అభ్యర్ధి సామా రంగారెడ్డికి (ఇబ్రాహిం పట్నం నియోజక వర్గంలో) మద్దతు నివ్వక పోవటం వారి మైత్రి బీటలువారటాన్ని సూచిస్తుంది. ఆ సందర్భంగా కాంగ్రెస్ ఉత్తం కుమార్ రెడ్డికి టిడిపి చంద్రబాబు నాయుడికి విభేధాలు పొడచూపాయన్న వార్తలు వచ్చాయి.   

Image result for chandrababu rahul gandhi maitri

ఆ కాలంలో కాంగ్రెస్, తెలుగు దేశం అంటూ విడిపోయి జనాలు మాత్రం ఒకరికి మరొకరు ద్రోహం చేసుకున్నారు. ఇరుపక్షాలు ఒకరినొకరు హత్యలు కూడా చేసుకున్నారు. ప్రజల మద్య రాజకీయ వైరాలను పెంచి పోషించిన రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన వీరు ఇప్పుడు రాజకీయ అవకాశం కోసం కొద్దీ చేతులు కలిపారు. ప్రజాకూటమి బ్రాండ్ క్రింద ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు.

Related image

తెలంగాణ గత 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో కలసి పనిచేసిన వీరి కలయిక ఫలితాలు ఎలా ఉంటాయో 11వ తేదీన (మంగళవారం) తెలిసిపోతుంది. ప్రస్తుతానికి పరిస్థితిని చూస్తే, తెలంగాణలో ప్రజాకూటమికి అధికారం దక్కడం కలలో కూడా జరిగేలా లేదు. కేసీఆర్ టీఆరెస్ను వీళ్ళంతా కలిసి కట్టుగా కూడా ఓడించలేకపోతున్నారని పదికి పైగా సర్వే సంస్థలు తమ ఎక్జిట్-పోల్స్ ద్వారా స్పష్టం చేశాయి.

Image result for malreddy rangareddy vs sama rangareddy

మరి అదే జరిగితే, అంటే ప్రజా కూటమి ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరిస్తుందనేది అందరికి ఆసక్తిని కలిగిస్తుంది. ప్రజాకూటమి గనుక ఓడితే కాంగ్రెస్ నేతలు చంద్ర బాబుపై విరుచుకుపడే అవకాశం మెండుగా ఉంది. చంద్రబాబుతో చేతులు కలపడం వల్లనే తెలంగాణలో ఓడామని వారు ధ్వజమెత్తే అవకాశాలున్నాయి. ఇది చాలావరకు వరకూ నిజమే. ఒకవేళ కాంగ్రెస్ గనుక చంద్రబాబుతో చేతులు కలపక పోయుంటే, వాళ్లను విమర్శించడానికి కేసీఆర్ చేతిలో ఏలాంటి బ;లమైన ఆయుధమూ ఉండేది కాదు.

Image result for malreddy rangareddy vs sama rangareddy
అలాంటప్పుడు రాహుల్-బాబు బంధంలో మార్పు ఉండకపోయినా వారి మైత్రి, రాజకీయ ప్రయోజనాలివ్వక పోవటంతో కార్యకర్తల స్థాయి నుండి రాష్ట్రస్థాయి నాయకత్వా ల  వరకు విభేధాలు బగ్గుమనటం తధ్యం. ఖచ్చితంగా చెప్పగలిగే అంశం ఏమిటంటే, ప్రజాకూటమి ఓడితే కాంగ్రెస్, చంద్రబాబుల మధ్యన దూరం పెరగవచ్చు, ఢిల్లీ సంగతులు ఏమో? కానీ, దాన్ని ప్రక్కన పెడితే మళ్లీ కాంగ్రెస్-టీడీపీలు కలిసి పోటీ చేయడం అనేది దుర్లభం. 

మరింత సమాచారం తెలుసుకోండి: