లగటిపాటి రాజ గోపాల్స రెడ్డి ఎప్పుడైతే సర్వే ఫలితాలు వెలువరిచాడో తెరాస ఒక సారిగా ఎదురు దాడికి దిగింది. అయితే ఈ లెక్కల్లో లగటిపాటి చాలా మ్యాజిక్ చేశాడని చెప్పొచ్చు. అందుకే లగడపాటి భలే జాగ్రత్తపడ్డారు. ఎక్కడయినా సర్వేకు ప్లస్ వన్ టు టూ అని చెబుతారు. లేదా మైనస్ వన్ టు టూ అని చెబుతారు. లగడపాటి కూడా మిగిలిన పార్టీల లెక్కలు అలాగే చెప్పారు. కానీ కాంగ్రెస్, టీఆర్ఎస్ ల దగ్గరకు వచ్చేసరికి ప్లస్ ఆర్ మైనస్ 10 అనేసారు. ఇదెక్కడి చోద్యం.

Image result for lagadapati raj gopal reddy

టీఆర్ఎస్ కు 25 నుంచి 45 మధ్యలో వస్తాయన్న విషయాన్ని ఆయన ఇలా చెప్పారు. అలాగే కాంగ్రెస్ కు 45 నుంచి 65 మధ్య వస్తాయని ఇలా చెప్పారు. ఇదెక్కడి గొప్పదనం. వంద సీట్ల తాలూకా ఎగ్జిట్ సర్వే ఇలా చెప్పడం గొప్పదనమా? 35కు కాస్త అటు ఇటు లేదా 55 కాస్త ఇటు అటు అనిచెప్పితే అది గొప్ప. దీనిని బట్టి చూస్తుంటే ఓటర్ల నాడి లగడపాటికి కూడా సరిగ్గా అందలేదని క్లియర్ అవుతోంది.

Image result for lagadapati raj gopal reddy

అందుకే తను ఏదో ఒకటి సరైనది చెప్పాలి కాబట్టి, అన్ని విధాలా ఆలోచించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుని, ఫలితాలు తను చెప్పినట్లు వచ్చినా, తేడాగా వచ్చినా, తను ఇజ్జత్ కు ఇబ్బంది రాకుండా చెప్పుకొచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తన జోస్యం నిజమైందని ఆటోమెటిక్ గా అందరూ చెబుతారు. కానీ తేడావస్తే, తాను ముందే చెప్పా, పది తగ్గొచ్చు అని తప్పించుకోవచ్చు. మొత్తానికి లగడపాటి తానే అంగీకరించినట్లు, ఈసారి సర్వే చేయడం బాగానే ఇబ్బంది పెట్టినట్లు కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: