యువతను పట్టుకుంటే ఏ ఎన్నిక అయినా సులువే. వారు మాట తప్పరు, మడమ తిప్పరు. ఒకసారి మాత్రం నమ్మి ఓటేస్తారు. మాట తప్పారో మరి ఆ వైపు చూడరు. కరెంట్ లాంటి యువతను టచ్ చేయడానికే ఆలోచించాలి. వారిని మభ్యపెట్టాలనుకుంటే కుదిరే వ్యవహారం అసలే కాదు. విషయానికి వస్తే ఏపీలోని యువత ఇపుడు ఎటువైపు. కొత్త ఓటర్లతో కలుపుకుని నిరుధ్యోగ యువత పెద్ద ఎత్తున నవ్యాంధ్రలో ఉంది.


బాబు.. జాబు :


సరిగ్గా నాలుగున్నరేళ్ళ క్రితం ఏపీ విభజన జరిగింది. ఏపీలో పెద్ద ఎత్తున ఉన్న యువత తమ భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారు. తమకు ఉపాధి రాదా అని తల్లడిల్లారు. ఆ టైంలో టీడీపీ అధినేత చంద్రబాబు వారికి ఒక హామీ ఇచ్చారు. అనుభవం కలిగిన తనను ఎన్నుకుంటే ఏపీలో జాబ్ క్రియేట్ చేసి ఇస్తానని. జాబ్ రావాలంటే బాబు రావాలని కూడా గట్టి నినాదం ఇచ్చారు. ఇది బాగానే వర్కౌట్ అయింది. దాంతో బాబు సీఎం పీఠం పట్టేశారు. అయితే ఇప్పటి వరకూ ఏపీలో జాబులు మాత్రం పెద్దగా లేవు. ఎక్కడా కూడా  తీయలేదు. మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి.


రెండు లక్షల ఖాళీలు :


ఇక ఏపీలో విభజన నాటి నుంచి ఇప్పటి వరకూ చూసుకుంటే ఇప్పటి వరకూ దాదాపుగా రెండు లక్షల పై చిలుకు వరకూ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని అంటున్నారు. నిరుద్యోగులు కూడా అంతకు పదింతలు పెరిగిపోయారు. ఈ సమయంలో వారిని ఆకట్టుకోవడానికి మరో మారు రాజకీయ పార్టీలు రంగంలోకి వస్తున్నాయి. బాబు ఈసారి జాబ్ అన్న మాట అంటే వినేందుకు యువత సిధ్ధంగా లేదని తేలిపోతోంది. యువ శక్తిని వాడుకుని వదిలేసారన్న విమర్శలు వున్నాయి. డీఎస్సీ  నిర్వహించడానికే పాలకులకు టైం లేదు, ఇక మామూలు ఉద్యోగాలు ఏం తీస్తారని యువత అంటోంది.


జగన్ అస్త్రం :


ఇపుడు అదే జగన్ అస్త్రంగా మారుతోంది. శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్రలో భాగంగా జరిగిన సభలో జగన్ నిరుద్యోగులకు భారీ హామీ ఇచ్చేశారు. తాను అధికారంలోకి వస్తే నిరిద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తానని జగన్ చెప్పారు. ఓ విధంగా ఉద్యోగాల విప్లవాన్ని తీసుకువస్తానని కూడా ప్రకటించారు. అన్నీ కలుపుకుని ఇప్పటివరకూ ఏపీలో ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని కూడా జగన్ గట్టి హామీనే ఇచ్చారు. ఇక అంతటితో ఆగకుండా ప్రతీ ఏటా ఒక షెడ్యూల్ పెట్టి జాబ్ క్యాలండర్ కూడా క్రియేట్ చేసి అప్పటికి ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తామని జగన్ చెప్పుకొచ్చారు. 

ఇది నిజంగా వైసీపీకి జగన్ కి కలసి వచ్చే అంశమేనని అంటున్నారు. ఓవైపు ఏపీలో నిరుద్యోగం పెరిగిపోతోంది. మరో వైపు యువతకు జాబులు లేవు. టీడీపీ హామీ అటకెక్కింది. అదే సమయంలో జగన్ నమ్మకంగా చెప్పిన ఈ మాటను మెజారిటీ యువతరం విశ్వసించే అవకాశాలే అధికంగా ఉన్నాయని అంటున్నారు. అదే కనుక జరిగితే ఏపీలో వైసీపీకి అతి పెద్ద సెక్షన్ నుంచీ అద్భుత‌మైన మద్దతు దొరికినట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి: