తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఏపీలో బలమైన పార్టీగా ఉండేది. విభజన జరగనంతవరకూ ఆ పార్టీ తెలంగాణాలో బలమైన పునాదులతో ఉండేది ఎపుడైతే కొత్త రాష్ట్రం ఏర్పాటైందో అప్పటి నుంచి టీడీపీ మెల్లగా తగ్గిపోతూ వచ్చింది. మరి రేపటి ఎన్నికల్లో ఎంతవరకూ పుంజుకుంటొందో తెలియదు కానీ టీడీపీ నేతలు మాత్రం తమది జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు.


కనీసం అయిదు రాష్ట్రాల్లో:


ఒక జాతీయ పార్టీని ఎన్నికల సంఘం గుర్తించాలంటే కనీసం అయిదు రాష్టాలలో ఆరు శాతం ఓటింగ్ కలిగి ఉండాలి. అలా చూసుకున్నపుడు సాంకేతికంగా టీడీపీని ప్రాంతీయ పార్టీగానే చూడాలి. అయితే పార్టీ వారు వెసులుబాటు కోసం జాతీయ అధ్యక్షున్ని , కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నా గుర్తింపు మాత్రం అధికారికంగా రావాలంటే మాత్రం పెద్ద తతంగమే ఉంది. ఇక తెలంగాణాలో పోటీ చేసిన ఊపులో టీడీపీలో కొత్త ఆశలే కలుగుతున్నాయని అంటున్నారు పొరుగున ఉన్న ఇతర రాష్ట్రాలలో కూడా పార్టీని విస్తరించాలని  భావిస్తున్నారట.


ఒడిషాలో పోటీ :


త్వరలో జరగనున్న ఒడిశా ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి టీడీపీ సిద్ధమైంది. ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో తెలుగువారు ఎక్కువగా ఉండటంతో  తెలుగుతమ్ముళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలున్న ఒడిశాలో.. తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో టీడీపీ పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. యాభై అసెంబ్లీ స్థానాలు, ఐదు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు ఒడిశా టీడీపీ అధ్యక్షుడు రాజేశ్ పుత్ర ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కోరాపుట్, నబరంగ్ పూర్, బెహ్రమ్ పూర్, అస్కా లోక్‌సభ స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతున్నట్లు ఆయన తెలిపారు.


ఓట్ల చీలిక కోసమా :


కాగా.. కోరాపుట్, రాయగడ, మల్కన్ గిరి, గజపతి, గంజాం, నబరంగ్ పూర్ జిల్లాల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నారు. టీడీపీ పోటీ చేయడం వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని బీజేడీ తేల్చేసింది. మరోవైపు కాంగ్రెస్ స్పందిస్తూ టీడీపీ వల్ల కచ్చితంగా బీజేడీ ఓట్లు చీలుతాయని తద్వారా తమ పార్టీకి లాభం చేకూరుతుందని వ్యాఖ్యానించింది. అంటే ఇది కాంగ్రెస్ టీడీపీ కలసి కొత్త వ్యూహాం పన్నుతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.


అక్కడ సంగతేంటి :


ఇక మొన్ననే ఆరు నెలల క్రితం కర్నాటక ఎన్నికలు జరిగాయి. అక్కడ జనతాదళ్ సెక్యులర్ కుమారస్వామి దేవెగౌడాలది ఉంది. మరి వారితోనో, కాంగ్రెస్ తోనో పొత్తు పెట్టుకుని టీడీపీ ఎందుకు పోటీ చేయలేదన్న ప్రశ్న వస్తోంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున తెలుగు వారు ఉన్నారు కూడా. ఇక తమిళనాడు విషయంలో తీసుకున్న వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. మరి అక్కడ కూడా టీడీపీ బరిలో ఉంటుందా అన్నది కూడా చూడాలి. పోతే ఒడిషా సీఎం నవీన్ పట్నాయ‌క్ బీజేపీకి సన్నిహితమని మాట వినిపిస్తోంది. అక్కడ బీజేపీ కూడా బలంగానే ఉంది. దాంతో అక్కడ ఇద్దరినీ  దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ బలం పెంచేందుకు హస్తంతో దోస్తీ కట్టిన టీడీపీ కొత్త ఎత్తుగడ ఇది అన్న మాట కూడా వినిపిస్తోంది. మరి చూడాలి 


మరింత సమాచారం తెలుసుకోండి: