లగడపాటి రాజగోపాల్.. రాజకీయ నాయకుడిగా కంటే సర్వేల నిర్వాహకుడుగానే ఇటీవల వార్తల్లో ఉంటున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా ఐకాన్ గా పేరున్న ఈ నాయకుడు రెండు రాష్ట్రాలు విడిపోయాక రాజకీయంగా ప్రాధాన్యం కోల్పోయారు. రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఐతే.. ఇప్పుడు ఆయన సర్వేల సన్యాసం కూడా తీసుకోవాలంటున్నారు కేటీఆర్.



ఇటీవల లగడపాటి రాజగోపాల్ చెప్పిన సర్వే ప్రజాకూటమే విజయం సాధిస్తుందని.. అధికార టీఆర్ఎస్ మట్టి కరుస్తుందని తేల్చి చెప్పింది. దీంతో ఈ సర్వేపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మంత్రి కేటీఆర్ అయితే ఏకంగా అసలు లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోలే చేయించలేదని చెబుతున్నారుఅంతే కాదు.. లగడపాటి రాజగోపాల్‌ చెప్పిందంతా సోది అంటూ ఎగతాళి చేసేశారు.



గ్రామాల్లో తిరుగుతూ ‘సోది చెబుతా.. సోది చెబుతా’అని చెప్పేవారి తరహాలో లగడపాటి సర్వే ఉందన్న కేటీఆర్.. ఆయనకు మీడియా అనవసర ప్రచారం కల్పించిందన్నారు. ఇదే రాజగోపాల్ తెలంగాణ ఉద్యమ సమయంలో రాజగోపాల్‌ అసలు ప్రత్యేక రాష్ట్రం రాదని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రం వచ్చాక రాజకీయ సన్యాసం తీసుకున్నా లగడపాటి ఇప్పుడు ఫలితాల తర్వాత సర్వేల నుంచి కూడా సన్యాసం తీసుకుంటారని కేటీఆర్ జోస్యం చెప్పారు

Image result for lagadapati vs ktr


అసలు లగడపాటి ఎగ్జిట్ పోల్ చేయించకపోయినా ఛానళ్లన్నీ దాన్ని ఎగ్జిట్ పోల్ గా చూపించడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. అంతే కాదు.. 11 వ తారీఖున పలువురు కూటమి ప్రముఖల జాతకాలు తేలతాయని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందుగానే కుంటి సాకులు వెదుక్కుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. మరి ఎవరి మాటలు నిజమవుతాయో 11వ తారీఖునే తేలేది.


మరింత సమాచారం తెలుసుకోండి: