ఇలా తెలంగాణా ఎన్నికలు అయ్యాయో లేదో అలా మొదలైంది ఐటీ దాడి. ఈసారి అది ఒంగోలుకు చెందిన ఓ బడా నేత పైకి మళ్ళింది. ఐటీ దాడులు ఈ రోజు ఉదయం నుంచి ఏక కాలంలో జరుగుతున్నాయి. దాంతో టీడీపీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఓ వైపు హై కమాండ్ ఎన్ని హూంకరింపులు చేసినా, ఎంతగా గొంతు సవరించినా ఐటీ దాడులు మాత్రం ఓ పద్ధతి ప్రకారం ఏపీలో జరిగిపోతున్నాయి.


మాగుంట కంపెనీల్లో దాడులు :


టీడీపీనేత, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కంపెనీల్లో దాడులు కొనసాగుతున్నాయి. చెన్నైలో మూడు రోజులుగా అధికారులు బాలాజీ గ్రూఫ్ కంపెనీల్లో తనిఖీలు చేపట్టారు. ఈ రోజు  కూడా సంస్థ ఆఫీసులు, ఫ్యాక్టరీలతో పాటూ ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. కంపెనీలకు సంబంధించిన లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కీలకమైన ఫైళ్లు, డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారట. చెన్నై టీనగర్ లోని మాగుంట కంపెనీల కార్యాలయం, పూందమల్లిలోని ఫ్యాక్టరీలో, చెన్నైలోని శ్రీనివాసులు రెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు పలు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. 


భారీ ఎత్తున నగదు స్వాధీనం :


సోదాల్లో ఇప్పటివరకు రూ.55 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే కంపెనీలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను సీజ్ చేసినట్లు సమాచారం. మూడు రోజుల నుంచి సోదాలు జరుగుతుండగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఓ పారిశ్రామికవేత్త దగకగన కిలో బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారట. అదే హోటల్లో ఉన్న ఇద్దరు దక్షిణకొరియా వాసుల వద్ద కొనుగోలు చేసినట్లు తేలడంతో వారిని అదుపులోకి తీసుకుని ఆరా తీయగా.. వారిచ్చిన సమాచారంతో మాగుంట కుటుంబానికి చెందిన సంస్థల్లో తనిఖీలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 
మాగుంట శ్రీనివాసులు రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్‌ నేతగా ఉన్నారు.. విభజన తర్వాత 2104 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అయన వచ్చే ఎన్నికల్లో సరైన హామీ కోసం టీడీపీ అధినేత మాట కోసం చూస్తున్నారు. కుదరకపోతే పార్టీ మార్చే ఆలొచనలోనూ ఉన్నారని అంటున్నారు. సరిగ్గా ఈ టైంలో మాగుంట ఆస్తులపై ఐటీ దాడులు జరగడం విశేషం.
 



మరింత సమాచారం తెలుసుకోండి: