తెలంగాణ ఎన్నికల్లో ఎవరు గెలవ బోతున్నారో మరో ఒక రోజులో ప్రజల ఇచ్చిన తీర్పు రాబోతుంది. అయితే ఆ లోపల వస్తున్న సర్వేలు అందరికీ బీపి ను పెంచుతున్నాయి. అయితే ఒక ప్రైవేట్ ఛానెల్ నిర్వహించిన సర్వే లో కాంగ్రెస్ దే విజయమని తేలిందంటా ... ఆ సర్వే  అంచనా ప్రకారం కాంగ్రెస్ సారథ్యంలోని మహా కూటమికి 55 నుంచి 60 సీట్ల మధ్య వచ్చే అవకాశం కనిపిస్తోంది. తెరాస కు 40 సీట్లకు అయిదు సీట్లు ప్లస్ ఆర్ మైనస్ వచ్చే అవకాశం వుందని సర్వే తేల్చింది .

Image result for telangana

వాస్తవానికి ఈసారి ఎన్నికల స్పేషాలిటీ ఏమిటంటే, అంచనాలు వేయడం అన్నది బాగా కష్టం కావడం. రాజకీయ పక్షాలు అన్నీ కూడా పోలింగ్ తరువాత కూడా పూర్తి ధీమాతో వుండడం.  అయితే టీఆర్ఎస్ కు రకరకాల సమస్యలు గ్రౌండ్ లెవెల్ లో కనిపించాయి. వివిధ పక్షాల్లో నెలకొన్న అసంతృప్తి క్లియర్ గా కనిపించింది. ఉద్యమ సమయంలో, అలాగే 2014లో కెసిఆర్ కు వెన్నుదన్నుగా ఏయే పక్షాలు నిలిచాయో వాటిల్లో చాలా పక్షాలు ఈసారి మహా కూటమి వెనుక వెళ్లడం అన్నది ఎన్నికల ముందూ కనిపించింది. ఎన్నికల తరువాత కూడా కనిపించింది.  అదే సమయంలో మరీ దిగువ స్థాయి ఓటర్లలో మాత్రం టీఆర్ఎస్ పట్ల నిబద్దత కనిపించింది. తెలంగాణ పార్టీ అంటే టీఆర్ఎస్ అన్న భావన కూడా కనిపించింది. ఇది కొంత వరకు టీఆర్ఎస్ కు శ్రీరామరక్షగా నిలిచింది.

Image result for congress

అయితే అందించిన స్కీములను కేసిఆర్ నమ్ముకుంటే, అందని స్కీములను హైలైట్ చేయడంలో కాంగ్రెస్ అండ్ కో విజయం సాధించాయి.  సరిహద్దు జిల్లాలు, సెటిలర్ల సంఖ్య బాగా వున్న జిల్లాల్లో టీఆర్ఎస్ వ్యతిరేకత ఎక్కువ కనిపించింది. కేవలం వారం రోజుల్లో టీఆర్ఎస్ పై వున్న వ్యతిరేకత శాతం బాగా పెరగడం అన్నది ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి శాపంగా మారినట్లు కనిపిస్తోంది. దీనికి కారణం, మీడియాను ఈసారి కాంగ్రెస్ సారథ్యంలోని మహా కూటమి సమర్థంగా వాడుకోవడం కూడా కావచ్చు. మొత్తం మీద చూసుకుంటే ఏ ఒక్కరికీ అందని ఓటరు నాడి ఏదయినా అద్భుతం చేస్తే తప్ప, తెలంగాణ ఏర్పాటైన తరువాత ఏర్పడే రెండో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కాంగ్రెస్ ముంగిట్లో రెడీ వుందని చెప్పక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: