జగన్ పాదయాత్ర దిగ్విజయంగా దూసుకుపోతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు. రాయలసీమ అయినా కోన సీమ అయినా ఎక్కడ చూసినా జనం భారీ స్థాయిలో వస్తున్నారు. మరీ ఉత్తరాంధ్ర లో అయితే జనాలు ఉప్పెనలా ఎగిసి పడుతున్నారు. ఈ జన సందోహం మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వం రిపోర్ట్స్ తెప్పించు కోవడం సహజం. అయితే ప్రతి రిపోర్ట్ లో జగన్ కు ప్రజాదరణ పెరుగుతుందని అందుకే జనాలు భారీ సంఖ్యలో వస్తున్నారని ఆ రిపోర్ట్ సారాంశం. 


ఈ జనాలు ఏంటి జగన్ ... ఇంటెలిజెంట్ వారు కూడా ఆశ్చర్య పోయే విధంగా...!

అయితే 2019 లో వైస్సార్సీపీ కి ఈ ఎన్నికలు జీవన్మరణ లాంటివి . 2014 లో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న జగన్ ఇప్పుడు ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని పాదయత్రలో తీవ్రంగా కష్ట పడుతున్నాడని చెప్పాలి. పోయిన ఎన్నికల్లో చేసిన పొరపాట్లు మరలా రిపీట్ చేయకూడదని తన పార్టీ ఎమ్మెల్యేలకు కూడా గట్టిగానే చెప్పినట్లు సమాచారం. నిజానికి చివరి ఎన్నికల్లో ఆ పార్టీ నాయకుల తీరు తోనే ఆ పార్టీకి విజయం చేకూరలేదు. 

Image result for jagan padayatra

అయితే టీడీపీ లాంటి పార్టీ ని ఢీ కొట్టాలంటే జగన్ చాలా వ్యహాత్మకంగా వ్యవహరించాలని విశ్లేషకుల అంచనా. ఎందుకంటే చంద్ర బాబు రాజకీయ వ్యహాలతో ప్రత్యర్థిని చివరి నిముషం లో బోల్తా కొట్టించగలడు. 2014 లో జరిగిందదే ... మొన్న నంద్యాల ఉప ఎన్నికలో కూడా జరిగిందదే . అందుకే చంద్ర బాబు ను తక్కువ అంచనా వేసే సాహసం జగన్ చేయడని చెప్పొచ్చు. తన రాజకీయ చాతుర్యం తో ప్రజలను తన వైపు  తిప్పుకొనే సామర్ధ్యం , పోలింగ్ మేనేజ్మెంట్ బాబు కు తెలిసిన నట్లు వైసీపీ పార్టీలో ఎవరికీ తెలియదని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: