ఎన్నికలు జరిగిపోయాయి. ఇక ఫలితాలు రావడం ఆలస్యం. అవి కూడా కొద్ది గంటల్లోనే వచ్చేస్తాయి. కొత్త ప్రభుత్వం కొసం ఇపుదు ముహూర్తాల వేట మొదలైంది. ఎవరికి పీఠం దక్కిన మంచి ముహూర్తం చూసుకుని పీఠం ఎక్కేయాలనుకుంటున్నారు. ఈ విషయంలో కేసీయార్ కి నమ్మకాలు ఎక్కువే. ఆయన అపుడే ఓ మంచి ముహూర్తం రెడీగా పెట్టుకున్నారట. అంతేనా మిగిలిన వ్యవహారాలు కూదా చక్కబెడుతున్నారట.


ఆయన రెడీ :


తెలంగాణా ఎన్నికల్లో హోరా హోరీ పోరాడిన కాంగ్రెస్, టీయారెస్ రెండూ కూడా సర్కార్ ఏర్పాటుకు రెడీ అంటున్నాయి. ఈ విషయంలో టీయారెస్ లో ఒకింత దూకుడు కనిపిస్తూంటే, కాంగ్రెస్ లో నిదానత్వం ఎక్కువగా  ఉంది. ఆ పార్టీ తరఫున బోలెడు మంది సీఎం అభ్యర్ధులు కావడమే ఇందుకు కారణం. ఇక టీయారెస్ లో ముఖ్యమంత్రి రెడీగా ఉన్నారు కాబట్టి ఏ బెడదా లేదు. దానికి తోడు కొంత మంది మంత్రుల చేత కూడ ప్రమాణం చేయించాలని కూడా టీయారెస్ డిసైడ్ అయిందట.


12న  ముహూర్తం భేష్ :


ఈ నెల 12వ తేదీ, పంచమి పూట మంచి ముహూర్తం ఉంది. ఆ రోజున ప్రమాణం చేయడానికి కేసీయార్ ముహూర్తం పెట్టుకున్నారని టాక్. బుధవారం కావడం కూడా కలసివస్తోంది. ఈ ముహూర్తం దాటిపోతే మళ్ళీ మంచి ముహూర్తాలు కొన్ని రోజుల వరకూ లేవు. ఇదే విషయం కాంగ్రెస్ లోనూ చర్చకు వస్తోంది. అక్కడ కూడా ముహూర్తాల గోల ఓ రేంజిలో ఉంది. గెలిస్తే బుధవారం సీఎమ్  పీఠం ఎక్కేయాలని చాలామందికి ఉన్నా రాహుల్ గాంధి నిర్ణయమే ఫైనల్. అలా కనుక చూసుకుంటే పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తం కుమార్ కే ఫస్ట్ చాన్స్ వస్తుందని అంటున్నారు.

ఎక్కడ గెలిచినా పీసీసీ అధ్యక్షునిని అవకాశం ఇవ్వడం కాంగ్రెస్ ఆచారంగా వస్తోంది.  ఇక మంత్రి వర్గం విషయంలో మాత్రం కాంగ్రెస్ అపుడే తొందర పడదు. కూటమి నేఅలతో సంప్రదించి కొద్ది రోజులు పోయాక వారిని తీసుకుంటుంది. మొత్తానికి కౌంటింగ్ కి సమయం దగ్గర పడడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాట్లపైన కూడా అటు పార్టీ పరంగా ఇటు అధికారికంగానూ హడావిడి చోటుచేసుకుంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: