ఈ శేతాకాలం పార్లమెంట్ సమావేశాలు, వాడిగా వేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యే రోజునే అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా రావడంతో ఆ వేడి సభపై పడుతుందనడంలో సందేహం లేదు. పైగా బీజేపీకి షాక్ ఇచ్చేలా ఫలితాలు కనుక ఉంటే ఇక పార్లమెంట్ లొ ఓ రేంజిలో రచ్చ జరుగుతుంది


జాతీయ ప్రజా కూటమి :


తెలంగాణాలో ప్రజా కూటమిని ఏర్పాటు చేసిన కాంగ్రెస్, తెలుగుదేశం జాతీయ స్థాయిలో కూడా దాన్ని విస్తరించబోతున్నారు. దానికి జాతీయ ప్రజాస్వామ్య కూటమి పేరు పెడతారని తెలుస్తోంది. ఈ కూటమిలో భావసారూప్యం కలిగిన అన్ని ప్రాంతీయ పార్టీల నాయకులు ఉంటారని భోగట్టా. ఈ రోజు డిల్లీలో బీజేపీ వ్యతిరేక కూటమి నేతలు సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు సొనియాగాంధి, రాహుల్ గాంధి, చంద్రబాబు, మాయావతి, మమతాబెనర్జీ, ములాయంసింగ్ యాదవ్, దేవెగౌడా, శరద్ పవార్, ఫారూక్ అబ్దుల్ల, డీఎంకే అధినేత స్టాలిన్ తో పాటు దేశంలోని ఏడు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా హాజరవుతున్నారు. ఇపుడు అందరి కళ్ళు ఈ మీటింగ్ మీదనే ఉన్నాయి.


కాంగ్రెస్ పెద్దన్నగా:


ఈ సమావేశాల్లో కీలకమైన రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నరు. కాంగ్రెస్ పెద్దన్నగా కూటమి ముందుకు సాగుతుందని, దానికి పేరు తో పాటు విధి విధానాలు, జెండా, అజెండా ఖరార్ చేస్తారని అంటున్నారు. చంద్రబాబు , కాంగ్రెస్ కీలకమైన పాత్రం పోషించే ఈ కూటమి పట్ల మిగిలిన నాయకులు ఎలా రియాక్ట్ అవుతారన్న దానిపైనే రేపటి దేశ రాజకీయం ఆధారపడిఉంది


మూకుమ్మడి రాజీనామాలు :


అపుడెపుడో బోఫోర్స్ కుంభకోణానికి నిరసనగా 1988లొ దేశంలోని విపక్ష పార్టీల ఎంపీలు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి సంచలనం స్రుష్టించారు. ఇపుడు కూడా అదే తరహాలో రాజీనామాలు చేయాలని మోడీ రాఫెల్ యుధ్ధ విమానాల కధను ఈ విధంగా జనంలోకి తీసుకుపోవాలని భావిస్తున్నారట. ఈ మూకుమ్మడి రాజీనామాల ఆలోచన చంద్రబాబుది కావడం విశేషం. మరి దీనికి ఎంతవరకు కూటమి నేతలు అంగీకరిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: