తెలంగాణాలో హంగు వస్తుందా. పోటా పోటీగా సాగిన ఎన్నికల సమరం చివరికి ఎవరికీ మ్యాజిక్ నంబర్ అందకుండా చేస్తుందా. ఇదీ ప్రస్తుతం రాజకీయ పార్టీలను వేధిస్తున్న ప్రశ్న. తెలంగాణాలో బహుముఖ పోటీలు జరగడం, అన్ని పక్షాలూ తలో కొంత ఓటింగ్ షేర్ తో పాటు సీట్లను కూడా లాక్కోవడానికి సిధ్ధంగా ఉండడంతో హంగు ఏర్పడుతుందా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి.


లగడపాటి చెప్పినట్లే:


హంగు అన్నది ఏ సర్వేలోనూ పెద్దగా కోట్ చేయకపోయినా లగడపాటి వారి సర్వే మాత్రం అలాగే చెప్పుకొచ్చింది. హంగు ఎందుకొస్తుందో కూడా పలు కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్  కేవలం 94 సీట్లకే పరిమితమైంది. ఇక బీజేపీ మొత్తం సీట్లకు పోటీ చేసింది. మజ్లిస్ పక్కాగా 8 సీట్లు గెలుచుకోనుంది. బీజేపీ బలం కూడా ఈసారి పెరగనుంది. అలాగే కూటమి కట్టిన టీడీపీ దశ కూడా మారనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న సీట్లు 119 అయినపుదు, అందులో మజ్లిస్ పోగా 111 నే పరిగణనలోకి తీసుకోవాల్సివచ్చినపుడు మ్యాజిక్ మార్క్ 60 సీట్లు ఎవరికైనా వస్తాయా అన్నదే ఇక్కడ చర్చ.


ఆ రెండు పార్టీలపైనే:


ఇపుడు తెలంగాణాలో ఎక్కడివారు అక్కడ సర్దుకుంటున్నారు. అయితే మజ్లిస్, బీజేపీ మాత్రం రాజకీయంగా ఇపుడు ప్రభావవంతమైన పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నయై. ఎలాగంటే హంగు వస్తే 8 సీట్లు కలిగిన మజ్లిస్ కింగ్ మేకర్ పాత్రలో కనిపిస్తుంది. ఆ పార్టీ కోరిన గొంతెమ్మ కోరికలు కూడా తీర్చాల్సింటుంది. ఇప్పటికే ఆ పార్టీ ఉప నాయకుడు అక్బరుద్దీన్ మాటల్లో చూస్తే హంగు వస్తే మేము ఏకంగా సీఎం పీఠానికే గురి పెడతామని కూడా చెప్పుకొచ్చారు. అంటే ఎవరు ఇక్కడ సీఎం ఆఫర్ ఇస్తే వారికేనని కాస్త ఓపెన్ గానే ఆయన చెప్పినట్లుగా భావిస్తున్నారు.  అదే విధంగా చూసుకుంటే మరో పార్టీ బీజేపీకి కూడా ఎక్కువ సీట్లు వస్తాయని అంటున్నారు.

అదే కనుక జరిగితే టీయారెస్ కి మెజారిటీ మార్క్ రావడం కష్టమే. అయితే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ కూటమికి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వదు. టీయారెస్ కి మాత్రం ఒకే అంటామని ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు. అలా కనుక చూసుకుంటే టీయారెస్ కి ఇపుడు రెండు పార్టీల మద్దతు ఉంది. అయితే ఇందులో మజ్లీస్ మద్దతు తీసుకుంటే బీజేపీ మద్దతు ఇవ్వదు. అది కండిషన్ గా ఉంది. 

మజ్లిస్ స్టెప్ ఏంటి :


ఇక హంగు వస్తే మజ్లిస్ స్టెప్ ఏంటి అన్నది కూడా చూడాలి. రాజకీయాల్లో ఎవరినీ అంత తేలిగ్గా నమ్మడానికి వీలు లేదు. అలాంటపుడు మజ్లిస్ తనకు సీఎం కావాలంటే ఎటూ కేసీయార్ ఇవ్వడు, అదే కాంగ్రెస్ కూటమి ఇస్తానంటే ఆ వైపుగా వెళ్ళినా ఆశ్చర్యం లేదు. ఇక, ఇప్పటికే జాతీయ స్థాయిలో ముస్లిం నాయకులు మజ్లిస్ తో టచ్ లో ఉన్నారన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరి మొత్తానికి తెలంగాణాలో రాజకీయ క్రీడ చాలా ఆసక్తిగా ఉండబోతోందా అనిపిస్తోంది అంతా చూస్తూంటే.


మరింత సమాచారం తెలుసుకోండి: