తెలంగాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ముందు తమకే ఇవ్వాలంటూ మహాకూటమి నేతలు గవర్నర్ ను రిక్వెస్ట్ చేయనున్నారు. ఆ విషయంగా మాట్లాడేందుకే ఈరోజు మధ్యాహ్నం కూటమిలోని ముఖ్యనేతలు గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ను కలవనున్నారు. 7వ తేదీన జరిగిన పోలింగ్ తర్వాత గెలుపు విషయంలో ఒకవైపు టిఆర్ఎస్ మరోవైపు మహాకూటమి ఎవరికి వారుగా తమదే గెలుపని చెప్పుకుంటున్న విషయం అందరూ చూస్తున్నదే. టిఆర్ఎస్ కు 108 సీట్లు వస్తాయని కెసియార్ బల్లగుద్ది మరీ  చెబుతున్నారు. అదే సమయంలో 80 సీట్లతో మహాకూటమే అధికారంలోకి వస్తుందని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు.

 Image result for kcr

అయితే, పోలింగ్ జరిగిన శాతాన్ని బట్టి మహాకూటమే అధికారంలోకి వస్తుందంటూ ఎన్నికల సర్వేల్లో ఆంధ్రా ఆక్టోపస్ గా పాపులరైన లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. దానికి తగ్గట్లే పోలింగ్ శాతం కూడా బాగా పెరిగింది. పోయిన ఎన్నికల్లో 68.5 శాతం ఓట్లు పోలవ్వగా మొన్నటి పోలింగ్ లో 73 శాతం పోలింగ్ నమోదైంది. అందుకనే మహకూటమికే లగడపాటి ఎడ్జ్ ఇచ్చారు. అయితే, సొంతంగా ప్రభుత్వం ఏర్పటు చేసే విషయంలో మహాకూటమి నేతల్లో ఎక్కడో అనుమానం ఉన్నట్లుంది. అందుకనే ఫలితాల సరళిని బట్టి ఎక్కువ సీట్లను గెలుచుకునే మహాకూటమికే ప్రభుత్వ ఏర్పాటులో తొలి అవకాశం ఇవ్వాలంటూ అడుగుతున్నారు.

 Image result for bjp and majlis

అదే సమయంలో సీట్ల లొల్లి కూడా మొదలైంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు మహాకూటమికి రాకపోతే ఏం చేయాలి ? అదే పరిస్దితి టిఆర్ఎస్ కు కూడా ఎదురైతే ఏం చేస్తుందనే అంశంపై అందరిలోను ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇటువంటి సమయంలో ఒకవైపు మజ్లిస్, మరోవైపు  భారతీయ జనతా పార్టీ కీలకంగా మారుతాయని అనుకుంటున్నారు. టిఆర్ఎస్, మహాకూటమికి గనుక ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం రాకపోతే అప్పుడు మరింత టెన్షన్ పెరిగిపోవటం ఖాయం. అందుకే మజ్లిస్, బిజెపిలను రెండు వైపుల దువ్వుడు కార్యక్రమం మొదలైంది. ఆ విషయం తెలిసే పై రెండు పార్టీలు కూడా బెట్టు చేస్తున్నాయి. మొత్తానికి మంగళవారం ఉదయం సుమారు 10.30 గంటల ప్రాంతానికి ఫలితాల ట్రెండును బట్టి అందరూ ఓ అంచనాకు వచ్చేయొచ్చు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: