తెలంగాణా రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఎన్నిక‌లు ముగిసినా .. ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌కు ఇంకా గ‌డువు ఉండ డంతో రాజ‌కీయ పార్టీలు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నాయి. మునుప‌టి క‌న్నా భిన్నంగా ఇప్పుడు తెలంగాణా ఫ‌లితం ఉంటుం ద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అంటే.. హంగ్ వ‌స్తుంద‌ని.. ఏ పార్టీకి కూడా పూర్తిస్తాయి మెజారిటీ వ‌చ్చేఅవ‌కాశం లేద‌ని తెలు స్తుండ‌డంతో అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న కాంగ్రెస్‌, టీఆర్ ఎస్‌లు తీవ్ర‌స్థాయిలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నాయి. ఎలా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని ఆలోచిస్తున్నాయి. అయితే, ఎలాగైనా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని అటు టీఆర్ ఎస్‌, ఇటు కాంగ్రెస్ కూడా తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే జంపింగ్‌ల‌పై రెండు ప్ర‌దాన పార్టీలు దృష్టి పెట్టాయి. 


ప‌ద‌వులు, డ‌బ్బుల‌కు లొంగిపోయే నాయ‌కుల‌ను త‌మ వైపు తిప్పుకొనేందుకు నాయ‌కులు పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు ప్రారంబించార‌ని తెలుస్తోంది. త‌మ‌తో క‌ల‌సి వ‌చ్చే అభ్య‌ర్థుల‌తో ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో అన్ని పార్టీల్లోనూ జంపింగ్‌ల‌పై భారీ ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఎవ‌రు అనుమానంగా అనిపిస్తున్నా.. వారిని అన్ని విధాలా జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తున్నారు. ఇక‌, అదేస‌మ‌యంలో చిన్నా చిత‌కా పార్టీలు కూడా ఇప్పుడు ప్ర‌ధాన శ్ర‌వంతిగా మారే ప‌రిస్తితి క‌నిపిస్తోంది. ముఖ్యంగా 6 నుంచి 7 స్థానాల్లో గెలుస్తామ‌ని భావిస్తున్న మ‌జ్లిస్ ప్రాధాన్యం, బీజేపీ ప్రాధాన్యం కూడా పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. 


ఒక‌వేళ రాష్ట్రంలో హంగ్‌ వస్తే 8 లేదా7 సీట్లతో మ‌జ్లిస్ పార్టీ కింగ్‌ మేకర్‌గా మారనుంది. అయితే, మిత్రపక్షమైన టీఆర్‌ఎస్ ను కాదని కాంగ్రెస్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని మజ్లిస్‌ నేతలు అంటున్నారు. తమకు పూర్తి మెజారిటీ వస్తుందని టీఆర్‌ఎస్‌ అంటోంది. అదే సందర్భంలో మెజారిటీ తగ్గితే అండగా నిలవాలని ఒవైసీని కేసీఆర్‌ కోరే అవకాశముంది. ఇవ‌న్నీ కాకుండా మజ్లిస్‌ను దూరం పెడితే టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేసీఆర్‌తో ఒవైసీ ఏకాంత భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీకి మజ్లిస్‌ కంటే ఎక్కువ సీట్లు వస్తాయా? తక్కువ వస్తాయా? అనే విషయాన్నీ విశ్లేషించనున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌కు 45-50 సీట్లు వస్తే స్వతంత్ర ఎమ్మెల్యేలు, మజ్లిస్‌ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తారు. దీంతో ఇప్పుడు అభ్య‌ర్థుల‌కు భారీ ఎత్తున డిమాండ్ పెర‌గ‌డం గ‌మ‌నార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి: