తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి దాదాపు 27 లక్షల ఓటర్ల పేర్లు గల్లంతవడం లేదా తొలగించడం ఎంతో ఆందోళన కలిగించే అంశం. ఇటు మీడియా తోపాటు అటు సోషల్‌ మీడియాలో విస్తృతంగా విమర్శలు వెల్లువెత్తడంతో గత శుక్రవారం నాడు పోలింగ్‌ ముగిశాక ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అందుకు క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. 27 లక్షల ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయంటే "ప్రతి పది మంది ఓటర్ల లో ఒకరికి ఓటు హక్కు గల్లంతైనట్లే" 
Image result for Votes missing from voters list of telangana
వేలు ముద్రల గుర్తింపు కలిగిన ఆధార్‌ కార్డులతో ఓటరు గుర్తింపు కార్డులను అనుసంధించాలని 2015లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటి నుంచే రాష్ట్రంలో ఓటర్ల తొలగింపు కార్య క్రమం ప్రారంభమైందన్న విమర్శలు నాడే వెల్లువెత్తాయి. ఓటర్ల గుర్తింపు కార్డులకు ఆధార్‌ కార్డు నెంబర్లను అనుసంధాలించాలంటూ కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ ఎలక్టోరల్‌ రోల్‌ ప్యూరిఫికేషన్‌ అండ్‌ అథెంటికేషన్ - ఎన్ఈఆర్‌పీఏపీ కార్యక్రమాన్ని రెద్ద ఎత్తున చేపట్టింది.
Mass Deletions Of Voter Names Reported In Telangana Elections 2018 - Sakshi
*ఒక్కొక్కరికి రెండు, మూడు ఓటరు గుర్తింపు కార్డులు లేకుండా చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నాడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆధార్‌ కార్డు లేని వారు ఓటు హక్కును కోల్పోవాల్సి వస్తుంది కనుక తక్షణమే ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 


*ఆధార్‌ కార్డు లేని ఓటరును గుర్తించేందుకు నాడు 'కేంద్ర ఎన్నికల సంఘం' ఒక సాఫ్ట్‌-వేర్‌ను రూపొందించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ సాఫ్ట్‌-వేర్‌ను అమలు చేయడం వల్ల ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయా? లేదా ఉద్దేశపూర్వకంగానే ఓటర్ల పేర్లను తొలగించారా ? అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. కొన్ని వర్గాల ప్రజల ఓట్లే గల్లంత య్యాయి కనుక, ఉద్దేశపూర్వకంగానే ఓటర్ల పేర్లను తొలగించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
Image result for Votes missing from voters list of telangana
*ఏ కారణంతో పేర్లను తొలగించిన సదరు ఓటర్లకు సమాచారం తప్పనిసరిగా అందించడం ఎన్నికల సంఘం బాధ్యతని, ఏ కారణంతో తొలగించాల్సి వస్తుందో, మళ్లీ దరఖాస్తు ఎలా చేసు కోవాలో, అందుకు సమర్పించాల్సిన ధ్రువపత్రాల వివరాలను కూడా స్పష్టంగా వివరించాలంటూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఆ మార్గ దర్శకాలను తెలంగాణ రాష్ట్రం ఎన్నికల సంఘం తుగలో తొక్కినట్లు భావించవలసి వస్తుంది కారణం వారు మాగదర్శకాలను పాటించిన దాఖలాలు కనిపించడం లేదు.
Image result for Votes missing from voters list of telangana
*ఇప్పటి కైనా రాష్ట్ర ఎన్నికల సంఘం గల్లంతయిన ఓటర్ల జాబితాను విడుదల చేయాలి. ఆ జాబితా ను పరిశీలిస్తే ఏయే అసెంబ్లీ నియోజక వర్గంలో ఎలాంటి ప్రభావం ఉండేదో రాజకీయ పరిశీలకుల అవగాహనకు అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా, స్వేచ్ఛగా నిర్వహించడమే కాదు, నిర్వహించినట్లు కనిపించడం కూడా ముఖ్యమేనని సుప్రీం కోర్ట్ ఆనాడే అభిప్రాయపడింది కనుక వీలైనంత త్వరగా ఎన్నికల కమిషన్‌ ఈ జాబితాను విడుదల చేసి 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి సరైన పకడ్బంధిగా ఓటర్ల జాబితాను సవరించి ఓట్లు కోల్పోయిన వారి ఓటర్ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలి.  
 Image result for Votes missing from voters list of telangana

Speaking to the media however, the DSP said that officials can't do anything at this point if their names are not found in the Voter List.

Image result for Votes missing from voters list of telangana

Gutta jwala shatler whose name missed from Voters List


మరింత సమాచారం తెలుసుకోండి: