తెలంగాణలో మరోసారి కేసీఆర్ సీఎం కానున్నారు. పూర్తి మెజార్టీతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాబతుందని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. నేడు మధ్యాహ్నాం కేసీఆర్ తో బేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  ఆ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుందని అన్నారు.  కేసీఆర్ తో ఆయన నాలుగు గంటల సేపు సమావేశంలో పాల్గొన్నారు.   తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. రేపటితో తెలంగాణలో బీజేపీ బలం ఏంటో తేలిపోతుందని అన్నారు. రేపు మరోసారి కేసీఆర్ ని కలుస్తానని అన్నారు.
Image result for kcr owaisi
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరి మద్దతు అవసరం లేదని అన్నారు.  అయినప్పటికే కేసీఆర్ కే మా పూర్తి మద్దతు ఉంటుంది. అసెంబ్లీ రద్దయినప్పుడే ఈ విషయం చెప్పానని గుర్తు చేశారు.  ప్రభుత్వంలో చేరాలనే ఉత్సాహం మాకు ఎప్పుడూ లేదని అన్నారు. గెలుపు పై నేను,  కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నాం.  ఎంఐఎం 8 సీట్లు గెలుస్తుంది.  అనుకున్న స్థానాలు గెలిచి టీఆర్ఎస్ స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు అసదుద్దీన్ ఒవైసీ. 

కాంగ్రెస్ తో నేను టచ్  ఉన్నట్లు చెబుతున్నారు..ఎవరితోనూ టచ్ లో ఉన్నానో చెప్పమని కోరుతున్నాను. ఇప్పుడే కాదు భవిష్యత్ లో కూడా కేసీఆర్ తోనే కలిసి ఉంటానని స్పష్టం చేస్తున్నానని అసద్ తెలిపారు.  ఇక బిజెపితో కలిసి టీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చే ప్రశ్నే ఉత్పన్నం కాబోదు అన్నారు. ఇప్పుడు బిజేపికి ఉన్న ఐదు సీట్లు కూడా తగ్గిపోతాయని అన్నారు..అది రేపు మీరు చూస్తరని అన్నారు.

తెలంగాణ ప్రజలకు ఒక విషయం చెప్పదల్చుకున్నానని రేపు రాబోతున్న తీర్పు కేసీఆర్ కే అనుకూలంగా వస్తుందని అన్నారు. మేం 8 సీట్లు గెలుస్తామనుకుంటున్నాం..కేసీఆర్ మరోసారి సీఎం అవుతారని మనస్పూర్తిగా అనుకుంటున్నానని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: