కాసేపట్లో కాంగ్రెస్ - కెసిఆర్ ల మధ్య ఎవరు గెలుస్తారు అనేది తెలిపో బోతోంది. రేపు ఈ పాటికి ముఖ్యమంత్రి ఎవరు అనేది దాదాపు గా ఖరారు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యం లో కెసిఆర్ - అసదుద్దీన్ ల మధ్యన మైత్రి బంధం గురించి విపరీతం గా డిస్కషన్ లు సాగుతూ ఉన్నాయి. పోస్ట్-పోల్ కుట్రలకు కాంగ్రెస్ తెరతీసినట్లుగా కనిపిస్తోంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ తెరాసను మాత్రం గద్దె ఎక్కనివ్వరాదనే వ్యూహంతో ఉన్న కాంగ్రెస్ అవసరమైతే.. ఈ ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా వ్యతిరేకించిన ఎంఐఎంను కూడా తమ జట్టులో కలుపుకోడానికి ఉత్సాహపడుతోంది.  కానీ ఒవైసీ యొక్క ఆలోచన సరళి , ప్లానింగ్ మాత్రం కాంగ్రెస్ కి పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఎన్నికలు ముగిసిన రోజు నుంచీ ప్రతీ పార్టీ తమకి ఎనభై సీట్లు పక్కా అనే మాట చెబుతూ వస్తున్నారు.

కానీ MIM మాత్రం ఎవరో ఒకరికి తమ మద్దతు అవసరం అవుతుంది అనీ ముఖ్యంగా కెసిఆర్ కే తమ అవసరం ఎక్కువగా ఉంటుంది అనే ఆలోచన లో ఉన్నట్టు చెబుతున్నారు. నిజానికి ఎంఐఎం ఎన్నికలకు ముందునుంచి తెరాసకు సన్నిహితంగా ఉంది.

వారు పోటీచేసే స్థానాల్లో కాకుండా.. రాష్ట్రంలో ఇతర ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో తెరాస తరఫున ప్రచారం కూడా నిర్వహించారు. అయినాసరే, వారి ప్రాపకం కోసం ఇప్పుడు కాంగ్రెస్ తాయిలాలు ఎర వేస్తోంది.  తెరాస మీద ఎన్నికల టైం లో ఎలా పేలినా కానీ కౌంటింగ్ పూర్తి అయిన తరవాత మాత్రం ఖచ్చితంగా కెసిఆర్ కే మద్దతు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు MIM వారు అంటున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ముందు ఉన్న ఒకే ఒక్క ప్రశ్న కెసిఆర్ - ఒవైసీ లని ఎలా విడగొట్టాలి ?


మరింత సమాచారం తెలుసుకోండి: