అధికారం చేతిలో ఉంటే చాలు రెండో సారి గెలవడం కోసం అధికార పార్టీ వాళ్ళు ఎంతవరకూ వెళతారు అనేది మనం అనేక దశాబ్దాల నుంచీ ఎన్నికల్లో చూస్తూనే ఉన్నాం. క్షుద్ర రాజకీయాలకి కూడా తెర తీసిన పార్టీలని దాటుకుంటూ పోలింగ్ నడిచిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.

అయితే కౌంటింగ్ కి మరి కొంత సమయం ఉన్న టైం లో కేంద్ర ఎన్నికల సంఘం మీదకి ఫిర్యాదు కోసం సిద్ధం అవుతోంది కాంగ్రెస్ పార్టీ. నకిలీ ఓటర్లని తొలగించే క్రమం లో రాష్ట్ర వ్యాప్తంగా తెరాస పార్టీ కావాలనే ఇరవై లక్షల ఓట్లని తొలగించింది అంటున్నారు రేవంత్ రెడ్డి. అర్హులు అయ్యి ఉన్న ఇరవై లక్షల ఓట్లు తీసేయడం ఏంటి అనే మాట వినిపిస్తోంది. 

ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కూడా తప్పైపోయింది క్షమించాలని కోరాడని అన్నారు.అర్హుల ఓట్లన్నీ తొలగించిన అధికారులు, ఒక్కొకరికి రెండు ఓట్లను ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కి సిద్ధిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో రెండు ఓట్లు ఉన్నాయంటూ సాక్ష్యాలను బైటపెట్టారు. రేవంత్ తో పాటు కాంగ్రెస్, టీడీపీ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోబోతున్నాయి.

ఎన్నికల సిబ్బందికి, ఉపాధ్యాయులకు పోస్టల్ బ్యాలెట్లు అందలేదని, దాదాపు 15వేలమంది ఉద్యోగులు ఓటు వేయలేకపోయారని వివరించారు. అధికార పక్షం కావాలి అనే ఇందులో కుమ్మక్కు అయ్యి బ్యాలేట్లు అందకుండా ప్లాన్ చేసింది అనే ఆరోపణలు వచ్చాయి. . కాంగ్రెస్ ఆరోపణలు ఎలా ఉన్నా.. ఓట్ల గల్లంతు మాత్రం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విషయమే.


మరింత సమాచారం తెలుసుకోండి: