మెగా ఫామిలీ లో ఎవరైనా కాంట్రవర్సీ వ్యక్తి ఉన్నారా అంటే మొదటి నుంచీ వినిపించే పేరు పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. ఎవరితో కలవకుండా డెక్కన్ క్రానికల్ లాంటి వాళ్ళ మీదకి సడన్ గా ఎగిసిన పవన్ అప్పుడప్పుడూ కనిపిస్తూ కనిపించిన ప్రతీ సారీ కాంట్రవర్సీ లో లీనం అయ్యేవాడు. చాన్నాళ్ళ తరవాత ఈ పద్ధతి మార్చుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో క్రియా శీలకంగా ఉన్నారు.
Image result for janasena
ఇప్పుడు పవన్ లాగా ఘాటు వ్యాఖ్యలు చెయ్యడం లో నగాబాబు సిద్ద హస్తులు గా కనిపిస్తున్నారు. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో నందమూరి బాలకృష్ణ మీదా తెలుగు సినిమా చానల్స్ మీదా దారుణ వ్యాఖ్యలు చేసారు నాగబాబు .
Image result for janasena nagababu
బాలయ్య అసలు ఎవరో కూడా నాకు తెలీదు అంటూ మాట్లాడారు ఆయన. పవన్ ను దెబ్బ తీసేలా మీడియా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు నిజమే అనుకుంటే.. మరి పవన్ ను ఫోకస్ చేసిన వైనాన్ని మర్చిపోతున్నారే అంటూ అడిగిన ప్రశ్నకు నాగబాబు బదులిస్తూ.. టీడీపీకి పవన్ మద్దతు ఇచ్చినంత కాలం తెలుగు మీడియా ఆయన్ను సపోర్ట్ చేసింది.
Image result for janasena nagababu
మద్దతు విరమించిన వెంటనే పవన్ మీద వ్యతిరేక కథనాలు ప్రసారం చేసిందన్నది మర్చిపోకూడదు అంటున్నారు. ఏదేమైనా త్వరలో జనసేన పార్టీ లో నాగబాబు అడుగు పెట్టె ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే వాదన వినపడుతోంది. నాగబాబు కి నరసాపురం ఎంపీ టికెట్ మీద మనసు ఉంది అనీ ఆయన ఆ ఆలోచన తో వెళుతున్నారు అనీ అంటూ సోషల్ మీడియా లో పుకార్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: