నాగబాబు ఉన్నట్టు ఉండి బాలకృష్ణ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తో ఇండస్ట్రీ హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇలా ఎందుకు నాగబాబు బాలకృష్ణ ను టార్గెట్ చేసి కమెడియన్ అనేంతలా వ్యాఖ్యలు చేసాడంటే, దానికి కారణం లేక పోలేదు . పవన్ కళ్యాణ్ మీద బాలకృష్ణ సంకర జాతి అంటూ అసభ్య కరంగా మాట్లాడినాడు . దీనితో ఆవేశ పరుడైన నాగబాబు కు సహజంగానే కోపం వచ్చింది.  అయితే నాగబాబు బాలకృష్ణ ను ఏమన్నాడంటే ,  మొన్న జరిగిన నా ఫేస్ బుక్ లైవ్ లో చిన్న తప్పు దొర్లింది. బాలకృష్ణ ఎవరు అని అడిగితే తెలియదు అనేశాను.

బాలకృష్ణ పెద్ద కమెడియన్ ... ఇదేంటి నాగబాబు ఇలా రెచ్చిపోతున్నాడు..!

అలా తెలియదు అనడం నా తప్పే. బాలయ్య అంటే తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. బాలయ్య మంచి నటుడు. ముఖ్యంగా ఆయన పెద్ద కమెడియన్. ఆయనంత కామెడీ చేసేవాళ్లు మనకు చాలా అరుదుగా ఉంటారు. బాలయ్య వెరీ గుడ్ కమెడియన్. ఎంతో హాస్యం చేస్తారు. ఆయన ఆంగిక అభినయం, పెర్ఫార్మెన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. ఇంత పెద్ద హాస్యనటుడు బాలకృష్ణ గారిని మరిచిపోయానని అనడం నా మిస్టేకే. పైగా ఆయన ఎన్టీఆర్ తో కూడా నటించిన కమెడియన్." ఇలా బాలకృష్ణ గురించి మాట్లాడుతూ... తను చెప్పే కమెడియన్ ఈయనే అంటూ వల్లూరి బాలకృష్ణ ఫొటో చూపించారు నాగబాబు.


బాలకృష్ణ పెద్ద కమెడియన్ ... ఇదేంటి నాగబాబు ఇలా రెచ్చిపోతున్నాడు..!

అప్పటితరం బాలయ్య మాత్రమే కాకుండా, ఈ బాలకృష్ణ కూడా తెలుసంటూ వ్యంగ్యంగా మరో వీడియో పోస్ట్ చేశారు. వల్లూరి బాలకృష్ణ అని వికీపీడియాలో కొడితే చాలా సమాచారం వస్తుంది. మరో విషాదకరమైన వార్త ఏంటంటే, ప్రస్తుతం బాలకృష్ణ మన మధ్య లేరు. ఆయన్ని మరిచిపోవడం పెద్ద తప్పే. బాలకృష్ణను గుర్తుచేసినందుకు చాలా థ్యాంక్స్. 3 రోజులుగా నలుగుతున్న వివాదాన్ని తాజా వీడియోతో ఇప్పుడు మరింత పెద్దది చేశారు నాగబాబు. దీంతో నందమూరి అభిమానులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే నాగబాబు చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఇప్పుడు పుండుపై కారం చల్లినట్టు మరో బాలకృష్ణ గురించి ప్రస్తావిస్తూ, నాగబాబు ఈ వివాదాన్ని ఇంకా పెద్దది చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: