క‌లిసొస్తే.. గుర్రం ఎగ‌రావ‌చ్చు! అనేది నానుడి! ఈ విష‌యం అటు రాజ‌కీయాల‌కే కాదు.. స‌మాజంలోని ఏ రంగానికైనా చెందుతుంది. ఎక్క‌డ మారు మూల ప‌ల్లెలో ప‌ల్లెప‌దాలు పాడుకునే ప‌స‌ల బేబి అనే మ‌హిళ ఓ నిర‌క్షురాస్యురాలు.. నేడు రెండు రాష్ట్రాల్లోనూ దిగ్గ‌జ గాయ‌కుల‌కు స‌మానంగా గౌరవం అందుకుంటుంద‌ని ఎవ‌రైనా ఊహించారా?! రాజ‌కీయాల్లోనూ అంతే! కానీ, తాజాగా మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. ఈ జ‌న్మ‌కు జ‌గ‌న్ సీఎం కాలేడు! అని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై నిప్పులు చెరుగుతున్నారు. నీజ‌న్మ‌కు మంత్రి అవ‌గా లేంది.. ప్ర‌జానాయ‌కుడిగా ఉన్న జ‌గ‌న్ సీఎం అవ‌లేడ‌ని ఎలా చెబుతావు? అంటూ నిల‌దీస్తున్నారు. 

Image result for adi narayana jagan

ఈ నేప‌థ్యంలో ఆది వ్యాఖ్య‌ల‌పై రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో కామెంట్లు పేలుతూనే ఉన్నాయి. ‘‘జగన్‌ ఈ జన్మకు సీఎం కాలేడు. స్థానిక పల్లెలో నన్ను అడ్డుకుంటానని ప్రగల్భాలు పలుకుతున్నారు. అది వారి తరంకాదు. మేం జగన్‌ని అడ్డుకుంటాం. ఆ సత్తా మాకుంది. గేమ్‌ స్టార్ట్‌ చేశాం. ఇక పవర్‌గేమ్‌ నడుపుతాం. పులివెందుల్లో కూడా ఇకపై పర్యటిస్తాం’’ అని మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇటీవ‌ల ఆవేశ పూరిత వ్యాఖ్య‌లు చేశారు. ‘‘జగన్‌ తన తండ్రి వైఎస్‌ ఫొటోను నిత్యం ఓ పేపర్‌లో పెట్టుకుంటూ ఆ పేపర్‌ తనది కాదంటాడు. భారతి సిమెంట్‌ తనది కాదంటాడు. హైదరాబాద్‌, బెంగుళూరుల్లో ఉన్న ఇళ్లు తనవి కాదంటాడు. ఆయనపై పెట్టిన 12 కేసులు కూడా తనవి కాదంటున్నాడు. ఆయనకు చెందిన చానల్‌లో, పేపర్‌లో ప్రతి నిత్యం మాపై తప్పుడు వార్తలు రాస్తున్నారు’’ అంటూ విరుచుకుపడ్డారు.

Image result for మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి

ఈ క్ర‌మంలోనే ఆది చేసిన వ్యాఖ్య‌ల‌ను సంచ‌లనంగా మారాయి. రాజ‌కీయాల్లో ఉన్నారు కాబ‌ట్టి నేత‌లు ప‌ర‌స్ప‌రం వ్యాఖ్య‌లు చేసుకోవ‌డం, విమ‌ర్శించుకోవ‌డం అనేది కామ‌న్‌. కానీ, జ‌న్మ‌లు అంటూ.. పెద్ద పెద్ద విమ‌ర్శ‌లు చేయ‌డంపైనే ఇప్పుడు ఓ వ‌ర్గం ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు. అలా అనుకుంటే .. ఎక్క‌డో ఉన్న లోకేష్‌ను తెచ్చి చంద్ర‌బాబు మంత్రిని చేశారు. వైసీపీ త‌ర‌ఫున గెలిచిన నిన్ను తెచ్చి మంత్రిని చేశారు. నువ్వు అనుకున్నావా?  నేను మంత్రిని అవుతాను! అని!! అని నిప్పులు చెరుగుతున్నారు., రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో.. ప్ర‌జ‌లు ఎలాంటి తీర్పు ఇస్తారో ఎవ‌రూ ఊహించ‌లేరు. పైగా ప‌వ‌ర్ గేమ్ స్టార్ట‌వుతుంది!అ న‌డం వెనుక కూడా ఏదో కుట్ర ఉంద‌ని, రాజ‌కీయాల్లో ఇలాంటి వ్యాఖ్య‌ల‌కు తావులేద‌ని అంటున్నారు. ఇవే వ్యాఖ్య‌లు వైసీపీ నేత‌లు అంటే... ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఎలాంటి రియాక్ష‌న్ ఉంటుందో ఊహించుకో! అంటూ ప్ర‌శ్న‌లు సంధించ‌డం ఆస‌క్తిగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: