భారత్ లో ఇబ్బడి ముబ్బడిగా బ్యాంకుల్లో అప్పులు చేసి ఎగవేసిన బడా వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఇపుడు ఆర్ధిక నేరగాడిగా స్వదేశంలో అడుగు పెడుతున్నారు. మాల్యాను భారత్ కి అప్పగించాలని బ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్ మాల్యాను భారతదేశానికి అప్పగించాలని వెస్ట్‌మినిస్టర్ కోర్టు ఈ రోజు ఆదేశించింది
.
దౌత్య విజయం :


దాదాపుగా 9 వేల కోట్ల రూపాయల  మేరకు బ్యాంకులను మోసం చేయడం, మనీలాండరింగ్‌కు పాల్పడటం వంటి ఆరోపణలతో ప్రస్తుతం ఆయనపై సీబీఐ, ఈడీ దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఈ దర్యాప్తును తప్పించుకునేందుకు 2016 మార్చిలో లండన్ వెళ్ళిపోయారు. దీంతో ఆయనను భారతదేశానికి అప్పగించాలని భారత ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ విచారణ అనంతరం
ఈ రోజు ఆయనను భారతదేశానికి అప్పగించాలని కోర్టు ఆదేశించడంతో భారతదేశం దౌత్యపరమైన విజయం సాధించినట్లయింది.


మోడీకి ప్లస్సేనా :


నిజానికి విజయ్ మాల్య యూపీయే హయాంలోనే దేశం విడిచి వెళ్ళిపోయారు. ఆయన ఆ విధంగా ఠోకరా పెట్టడానికి దేశంలోని నాటి పాలకులు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే మాల్యాను దేశం దాటించారని, ఇందులో బీజేపీ పెద్దలే ఉన్నారని ఇన్నాళ్ళు కాంగ్రెస్ ఘాటు విమర్శలు చేస్తూ వచ్చింది. ఇపుడు విజయ్ మాల్యాను ఈ దేశంలోకి తీసుకురావడం ద్వారా మోడీ ప్రభుత్వం విజయం సాధించింది. ఇది నిజంగానే మోడీకి పెద్ద సక్సెస్ కిందనే లెక్క. అసలే రాఫెల్ స్కాం తో పాటు, ఇతర ఆరోపణల సెగ తగులుతున్న టైంలో విజయ్ మాల్యని ఈ దేశంలోకి రప్పించడం బీజేపీకి ఎన్నికల టైంలో బాగా ఉపయోగపడే అంశమేనని అంటున్నారు. ఇక కాంగ్రెస్ కి ఈ విషయంలో విమర్శించేందుకు కూడా ఏమీ ఉండదని కూడా అంటున్నారు.


జైలు  రెడీ :


ముంబైలోని అత్యంత ప్రాచీనమైన ఆర్థర్ రోడ్ జైలు  ఇపుడు విజయమాల్యా కోసం సిద్ధంగా ఉంది. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ జైలులో కట్టుదిట్టమైన భద్రతతోపాటు మాల్యా కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ముంబైలోని అతి పెద్ద జైలు కూడా అయిన ఆర్థర్ రోడ్ జైలులో విజయ్ మాల్యా కోసం ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లతో బ్యారక్ నెం.12లో ఓ గదిని సిద్ధం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: