కేసీఆర్ మళ్లీ సీఎం అవుతాడా.. లేక ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో రెస్టు తీసుకుంటారా.. ఇప్పుడు అందరిలోనూ ఇదే ప్రశ్న. దీనికి సమాధానం కోసం అనేక విశ్లేషణలు జరుగుతున్నాయి. రేపు ఈవోఎంలు తెరిచి లెక్కించే వరకూ ఈ విశ్వప్రయత్నాలు తప్పవు. అందుకు అనేక మార్గాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి.


అలాంటి వాటిలో జ్యోతిష్యం ఒకటి. జనాల్లో కేసీఆర్ భవిష్యత్ పట్ల ఉన్న ఆసక్తి కొద్దీ కొన్ని న్యూస్ ఛానళ్లు జ్యోతిష్యం మీద కూడా డిస్కషన్స్ పెట్టాయి. టీవీ5 మూర్తి నిర్వహించిన డిబేట్ లో పాల్గొన్న రవి కుమార్ అనే ఓ వాస్తు శాస్త్ర నిపుణులు కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు.

Image result for astrology. ఆయన ఓ విచిత్రమైన వాదన లేవనెత్తారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ఎటు వైపు ఉంటే వారికే అధికారం సిద్ధిస్తుందని చెప్పుకొచ్చారు. అంటే ప్రజాకూటమికి అధికారం దక్కుతుందని చెబుతున్నారు. అయితే ఇందుకు ఆయన చెప్పిన వివరణ ప్రేక్షకులకు అంత సంతృప్తి ఇవ్వలేకపోయింది.


సాధారణంగా కేసీఆర్ కూడా వాస్తు, జ్యోతిష్యాలను విపరీతంగా నమ్ముతారు. ఈ విషయం బహిరంగ రహస్యమే. అసలు జ్యోతిష్యం ప్రకారమే ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్న వాదనలూ ఉన్నాయి. మరి అలాంటి కేసీఆర్ జ్యోతిష్యాన్ని సరిచేసుకోలేకపోయారా అన్న ఆసక్తికరమైన ప్రశ్న. మరి ఈ జ్యోతిష్యం ఎంతవరకూ కరెక్టో మరికొన్నిగంటల్లో తేలిపోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: