కొద్దిసేపట్లో తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభంకాబోతోంది. ఇందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభంకానుంది. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 43 ఎన్నికల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్క హైదరాబాద్ లోనే 12 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Image result for telangana votes counting


ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 73 శాతం పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు రౌండ్లవారీగా ఉంటుంది. ఒక్కో రౌండ్ కు 14టేబుళ్లు ఉంటాయి. ఇంతకీ తెలంగాణలో తొలిఫలితం ఎప్పుడు విడుదలవుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం భద్రాచలం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అత్యల్పంగా 12 రౌండ్లలోనే లెక్కింపు పూర్తవుతుంది.

Related image


భద్రాద్రి జిల్లాలోనే ఉన్న మరో నియోజకవర్గం అశ్వరావుపేటలోనూ త్వరగానే ఫలితం వెలువడుతుంది. ఇక్కడ కూడా కేవలం 12 రౌండ్లలోనే ఫలితం వెలువడుంది. ఇక అన్నింటికంటే చివరన వచ్చే ఫలితం శేరిలింగంపల్లిది. ఇక్కడ గరిష్టంగా 42 రౌండ్లపాటు ఎన్నికల లెక్కింపు తర్వాతే ఫలితం వస్తుందిహైదరాబాద్ లో చార్మినార్ నియోజకవర్గం ఫలితం ముందుగా వెలువడుతుంది. ఆ తర్వాత అన్నింటికంటే చివరన యాకుత్ పూరా నియోజకవర్గం రిజల్ట్ వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: