ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సాధారణంగా గంటసేపట్లోనే ట్రెండ్ తెలిసే అవకాశం ఉంది. కానీ ఈసారి మాత్రం ఫలితాలు ఓ గంట ఆలస్యంగా వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈసారి ఈసీ కొత్త నిబంధనలు విధించింది.

Image result for telangana votes counting


కొత్త నిబంధనల ప్రకారం ముందుగా ఎలక్ట్రానిక్ పద్దతిలో వచ్చిన ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలు తెరుస్తారు. ఒక్కో ఈవీఎంలో 1400 ఓట్లు ఉంటాయి. కాబట్టి ఒక్క రౌండ్ కు 14 వేల ఓట్లు ఉంటాయి.

Image result for telangana votes counting


ఈవీఎం ఓట్లు లెక్కించిన తర్వాత ర్యాండమ్ గా వీవీ ప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను కూడా లెక్కిస్తారు. ఈ రెండూ సరిపోలాల్సి ఉంటుంది. కొత్త రూల్ ప్రకారం.. ఒక్కో రౌండ్ తర్వాత పోలింగ్ ఏజంట్ల నుంచి అభ్యంతరం లేదని సంతకాలు తీసుకుంటారు. ఈ ప్రక్రియ వల్ల సాధారణంగా కంటే ఆలస్యంగా ఫలితాలు వెలువడతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: