అందరిలోను టెన్షన్ పెంచేస్తున్న ఎన్నికల ఫలితాల విడుదల గతంలో కన్నా సుమారుగా రెండు గంటలు ఆలస్యం జరిగే అవకాశం ఉంది. పోయిన ఎన్నికల వరకూ ప్రతీ రౌండులోను కౌటింగ్ అయిపోగానే ఫలితం అనధికారికంగా విడుదలైపోయేది. ఎందుకంటే, మొదటి రౌండు కౌటింగ్ అయిపోగానే అధికారులు, అభ్యర్ధులో లేకపోతే వారి ప్రధాన ఎన్నికల ఏజెంట్లతో పాటు మీడియా కూడా అక్కడే ఉండేది. కాబట్టి ఏ రౌండుకారౌండు ఫలితం కొద్దిపాటు తేడాతో అయినా  అనధికారికంగా బయటకు వచ్చేసేది. కానీ తాజా ఎన్నికల విషయంలో ఎన్నికల కమీషన్ తీసుకొచ్చిన కొత్త నిబంధనతో ఎన్నికల ఫలితాలు బయటకు వచ్చేందుకు ఆలస్యం అవుందన్నది సమాచారం.

 Image result for telangana elections

ఇంతకీ విషయం ఏమిటంటే, ఎన్నికల కమీషన్ తీసుకొచ్చిన కొత్త నిబంధన ఏమిటంటే, కౌంటింగ్ పూర్తవ్వగానే ముందుగా ఆ రౌండులో వచ్చిన ఓట్ల వివరాలను ఓ స్టేట్మెంట్ రూపంలో అభ్యర్ధికో లేకపోతే చీఫ్ ఎలోక్టర్ల ఏజెంటుకు అందిస్తారు. ఈ స్టేట్మెంటును అభ్యర్ధులో లేకపోతే వారి తరపున వారో ఎవరో ఒకరు సరిచూసుకుని సంతకాలు పెట్టి మళ్ళీ అధికారులకు అందివ్వాలి. అప్పుడది రిటర్నింగ్ అధికారి దగ్గరకు వెళ్ళి సంతకం అయిన తర్వాత ఎన్నికల కమీషన్ అధికారిక వెబ్ సైట్ లో అప్ లోడ్ అవుతుంది. అదే సమయంలో రిటర్నింగ్ అధికారి దగ్గర నుండే మీడియాకు కూడా కాపీలు అందుతాయి.

 Image result for telangana elections

రౌండు ఫలితాన్ని అభ్యర్ధులో లేకపోతే వారి తరపు వారో సరిచూసుకోవాలంటే ఒకటి పదిసార్లు చూసుకోనిదే సంతకాలు చేయరు కదా ? అందుకే బాగా ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి.  ఈ కొత్త నిబంధన ఎందుకు తెచ్చిందంటే అన్నీ రౌండ్ల కౌంటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరో ఒకరు అభ్యంతరాలు పెట్టటం మళ్ళీ మొదటి నుండి రీకౌంటింగ్ చేయటమనే ప్రొసీజరుకు ఫులిస్టాప్ పెట్టటానికేనట. సరే ఏదో ఆశించి ఎన్నికల కమీషన్ కొత్త రూల్ తెచ్చింది. మరి పార్టీలు, అభ్యర్ధులు దాన్ని తూచా తప్పకుండా పాటించాలి కదా ? పోనీ మీడియా అయినా పాటిస్తుందా డౌటే ? మరి  కొత్త రూలు ఎంత వరకూ అమల్లోకి వస్తుందో చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: