అంతా అనుకున్నట్లుగానే ఫలితాల సరళి ఉంటోంది. ఎగ్జిట్ పోల్స్ లో చెబుతున్నట్లుగానే దేశంలోని అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తొలి ట్రెండ్స్ ఉంటున్నాయి. తెలంగాణాకు సంబంధించి పోటాపోటీ వాతావరణం కనిపిస్తోంది. తొలి ట్రేండ్స్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.


టీయారెస్  లీడ్ :


తెలంగాణా ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం కౌంటింగ్ మొదలైంది. తొలి ఫలితాల సరళి చూసుకుంటే రెండు పార్టీలకు సమాన అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాయి. టీయారెస్ ఆరు చోట్ల లీడ్ లో ఉంటే కాంగ్రెస్ రెండు చోట్ల లీడ్ లో ఉంది. సిరిసిల్ల, జగిత్యాలలో టీయారెస్  లీడ్ లో ఉన్నట్లుగాన తెలుస్తోంది. కాంగ్రెస్ రెండు చోట్ల లీడ్ లో ఉంది.  అంటే హోరా హోరీ పోరు తప్పదని అర్ధమవుతోంది. బహుముఖ పోటీల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది.


రాజస్థాన్లో కాంగ్రెస్ :


ఇక రాజస్థాన్లో తొలి ఫలితాలు కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నాయని తెలుస్తోంది. 12 చోట్ల కాంగ్రెస్ అక్కడ ఆధిక్యంలో ఉంటే, బీజేపీ ఆరు చోట్ల ఉంది. మధ్యప్రదేశ్ లో తీసుకుంటే కాంగ్రెస్ అయిదు చోట్ల, బీజేపీ నాలుగు చోట్ల లీడ్ లో ఉన్నాయి. చత్తీస్ ఘడ్ తీసుకుంటే అక్కడ పోటా పోటీగా కాంగ్రెస్, బీజేపీ ఉన్నట్లు తొలి ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: