భారత దేశంలో ఐదు రాష్ట్రాలు తెలంగాణ, మద్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాం, రాజస్థాన్ లో ఎన్నికలు జరిగాయి.  నేడు ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో ఎంతో ఉత్కంఠత నెలకొంది.  ఈ ఎన్నికల ఫలితాలను బట్టే వచ్చే ప్రధాన మంత్రి ఎవరు అన్న విషయం తేలిపోతుంది.  ఈ ఎన్నికల ప్రభావం కాంగ్రెస్, బిజేపి పై చూపించబోతుంది.  తెలంగాణలో టీఆర్ఎస్, మహాకూటమి మద్య హోరా హోరి యుద్దం కొనసాగుతుంది.

లైవ్ అప్ డేట్స్: 8:00 to 9:00
మద్య ప్రదేశ్ ..కాంగ్రెస్-10, బీజేపీ - 9 ఇతరులు -0
రాజస్థాన్ .. కాంగ్రెస్ - 12, బిజెపి - 5
మద్యప్రదేశ్ లో కాంగ్రెస్ - 10, బీజేపీ - 9
ఛత్తీస్ గఢ్ : కాంగ్రెస్ - 14, బీజేపీ - 16
మిజోరాం : కాంగ్రెస్ - 01, ఇతరులు - 01
తెలంగాణ లో పోస్టల్ బ్యాలెట్ : నల్లగొండ జిల్లా తుంగతుర్తి లో టీఆర్ఎస్ ఆదిక్యం, సిరిసిల్ల, జగిత్యాల, హుస్నాబాద్, మక్తల్, తుంగతుర్తి, హుజూరాబాద్ టీఆర్ఎస్ ఆదిక్యం
తెలంగాణ : టీఆర్ఎస్ - 6, కూటమి - 2
ఖమ్మం టౌన్ టీఆర్ఎస్ అభ్యర్థి అజయ్ ఆదిక్యం
ఎల్లారెడ్డి, కామారెడ్డి లో కాంగ్రెస్ ఆదిక్యం
సూర్యాపేటలో తొలిరౌండ్ లో కాంగ్రెస్ కు 214 ఓట్ల ఆదిక్యం..
మొదటి రౌండ్ లో వర్ధన్న పేటలో టీఆర్ఎస్ ఆదిపత్యం, ఖమ్మం, పాలేరులో టీఆర్ఎస్ ఆదిక్యం
సిద్దిపేటలో రెండో రౌండ్ లో 13,040 ఓట్ల ఆదిక్యంలో హరీష్ రావు
వరంగల్ వెస్ట్ లో టీఆర్ఎస్ కి తొలి రౌండ్ లో 3,022 ఆదిక్యం
బాన్సు వాడలో టీఆర్ఎస్ ఆదిక్యం
ఖైరతాబాద్ , జూబ్లీ హిల్స్ లో టీఆర్ఎస్ ఆదిక్యం
పోస్టల్ బ్యాలెట్ లో నల్లగొండ - కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మునుగోడు - రాజగోపాల్ రెడ్డి ఆదిక్యం
మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి ఆదిక్యం
తుంగతుర్తి లో తొలి రౌండ్ లో అద్దంకి దయాకర్ (కాంగ్రెస్ ) 48 ఓట్ల ఆదిక్యం

9:00 am లైవ్ అప్డ డేట్స్ :

జలరాపాటన్ నియోజకవర్గం నుంచి రాజస్తాన్‌ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి వసుంధర రాజే ముందజలో ఉన్నారు.  రాజస్తాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సచిన్‌ పైలెట్‌ టోంక్‌ నియోజకవర్గం  నుంచి ముందజలో ఉన్నారు.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ 5 స్థానాల్లో, బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. రాజస్తాన్‌లో కాంగ్రెస్ 14 స్థానాల్లో, బీజేపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ 2 స్థానాల్లో, బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 

రాజస్తాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌, బీజేపీల మధ్య హోరాహోరి నెలకొంది.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఇబ్రహీంపట్నంలో మల్‌ రెడ్డి రంగారెడ్డి , పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు, కామారెడ్డిలో షబ్బీర్‌ అలీ,  పరకాలలో చల్లా ధర్మారెడ్డి, మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి దూసుకుపోతున్నారు.   

 కొండగల్‌లో రేవంత్‌రెడ్డి వెనుకంజలో ఉన్నారు. రెండో రౌండ్‌లో కూడా డికె అరుణ, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి వెనుకంజలో ఉన్నారు.  కారును వెంటాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ కూడా హైస్పీడ్‌లో దూసుకుపోతుంది. ఇప్పటికి టీఆర్‌ఎస్‌ 70, కాంగ్రెస్‌ 26, బీజేపీ 1, ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

నల్గొండ జిల్లాలో 9218 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వచ్చాయి. మక్తల్‌, సిరిసిల్ల, తుంగతుర్తి, సూర్యాపేట్‌, సిద్దిపేట, హుస్నాబాద్‌లో టీఆర్‌ఎస్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల ఆధిక్యంలో ఉంది. వరంగల్‌ పశ్చిమలో మొదటి రౌండ్‌ పూర్తయ్యేసరికి 3022 ఓట్లతో టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో ఉంది. 

కాంగ్రెస్టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ తప్పదని తేలిపోయింది. ఇప్పటి వరకు వెల్లడైన పోస్టల్ బ్యాలెట్లలో కారు, హస్తం ఒక్కో స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలైన పలువురు కౌంటింగ్ తొలి ట్రెండ్స్ ను బట్టి వెనుకంజలో ఉండగా, మరికొందరు లీడ్ లోకి వెళ్లిపోయారు. డీకే అరుణ, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు వెనుకబడిపోయినట్టు తెలుస్తోంది.

ఇబ్రహీంపట్నంలో మహాకూటమి మద్దతుతో పోటీపడిన మల్ రెడ్డి రంగారెడ్డి ముందంజలో ఉన్నారు.

పరకాల నియోజకవర్గం మహాకూటమి అభ్యర్థి, కాంగ్రెస్ నేత కొండా సురేఖకు షాక్ తగిలింది. తాజాగా టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి సురేఖపై 6,000 ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్నారు. 

 వరంగల్ తూర్పు టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ మహాకూటమి అభ్యర్థిపై 1,100 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు.

చెన్నూరులో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ కు సానుకూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. చెన్నూరులో తొలి రౌండ్ ముగిసేటప్పటికీ మహాకూటమి అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్ పై బాల్క సుమన్ 3,036 ఓట్ల మెజారిటీతో ముందుకు దూసుకుపోతున్నారు.

ఖమ్మం జిల్లా మధిరలో కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా తమ సమీప టీఆర్ఎస్ అభ్యర్థి కన్నా వెనుకంజలో ఉన్నారు. 

కొడంగల్ నుంచి ప్రజా కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలబడిన రేవంత్ రెడ్డి తోలి రౌండ్ లో ఆధిక్యాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. రెండో రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి ఆయన సుమారు 600 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.

కాంగ్రెస్ 75 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 65 సీట్లలో ఆధిక్యంలో ఉంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని మొదటి నుంచి చెబుతున్న కాంగ్రెస్ శ్రేణులు గెలుపుపై ధీమా ఉన్నారు. 

జలరాపాటన్ నియోజకవర్గం నుంచి రాజస్తాన్‌ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి వసుంధర రాజే ముందజలో ఉన్నారు.  రాజస్తాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సచిన్‌ పైలెట్‌ టోంక్‌ నియోజకవర్గం  నుంచి ముందజలో ఉన్నారు.

11:00 am లైవ్ అప్ డేట్స్ :

వర్ధన్నపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేశ్ ఘనవిజయం సాధించారు. మరోవైపు శేరిలింగంపల్లిలో టీడీపీ నేత, మహాకూటమి అభ్యర్థి భవ్య ఆనందప్రసాద్ పై టీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ 12,250 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

 తాజా అప్ డేట్ ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు 8,932 ఓట్ల లీడ్ తో విజయం దిశగా దూసుకుపోతున్నారు.

మాజీ మంత్రి, టీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న తన సమీప ప్రత్యర్థి పై 6,388 ఓట్ల లీడ్ తో కొనసాగుతున్నారు. బాల్కొండలో టీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి, ఖైరాతాబాద్ లో దానం నాగేందర్ బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిపై 3,179 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.

నకిరేకల్‌లో మూడో రౌండ్‌ పూర్తయ్యేసరికి టీఆర్‌ఎస్‌(వేముల వీరేశం) ఒక్క ఓటు ఆధిక్యంలో ఉంది. 

 నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని వెనుకంజలో ఉన్నారు. 

పీసీసీ చీఫ్  ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్.. తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయి.. 
మేము మొదటి నుంచి అనుమానిస్తున్నట్టుగానే ఈవీఎం లలో  టాంపరింగ్ జరిగినట్టు స్పష్టమైన అనుమానాలు ఉన్నాయి..
VVpat లలో స్లిప్ ల  ఓట్ల లెక్కింపు తప్పకుండా జరపాలి. ఈ విషయంలో అందరూ ప్రజా కూటమి అభ్యర్థులు రిటర్న్ అధికారులకు ఫిర్యాదు చేసి.. vvpat లెక్కింపు జరిపే వరకు పట్టు పట్టాలి. ఈ విషయంలో ఈసీ కి కూడా ఫిర్యాదు చేస్తున్నాము. 
ఎవరెవరు ఒడిపోతారో trs నాయకులు ముందుగానే ఎలా చెపుతారు.  ఎన్నికల ఫలితాలు ముందుగానే ఎలా చెప్పగలిగారో చెప్పాలి.. ఇదంతా taamparing ను బలపరుస్తున్నాయి.. ఉత్తమ్...

2:00 pm లైవ్ అప్ డేట్స్ : 

ఇక్కడ మూడో రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ బీజేపీ తెలంగాణ చీఫ్ లక్ష్మణ్  పై 3,559 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.

ఆదిలాబాద్ లో మాజీ మంత్రి, టీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న తన సమీప ప్రత్యర్థి పై 6,388 ఓట్ల లీడ్ తో కొనసాగుతున్నారు. బాల్కొండలో టీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి, ఖైరాతాబాద్ లో దానం నాగేందర్ బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిపై 3,179 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 

కారు వేగంగా దూసుకుపోతున్నా..కొన్నిచోట్ల దెబ్బతగులుతోంది. కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌ అభ్యర్థి కందాల ఉపేందర్‌ రెడ్డి చేతిలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఓటమిపాలయ్యారు.

నోముల నర్సింహయ్య కాంగ్రెస్‌ అగ్రనేత జానారెడ్డిని ఓడించారు. రేవంత్‌ రెడ్డి, డీకే అరుణలాంటి నేతల ఓటమి కూడా దాదాపు ఖరారైపోయింది. 

టీఆర్‌ఎస్‌ ఇప్పటికి 11 స్థానాల్లో గెలుపొందగా 79 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌ 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఒక స్థానంలో గెలుపొందింది. ఎమ్‌ఐఎమ్‌ రెండు చోట్ల గెలుపొందగా.. 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ, ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 

మిజోరం ముఖ్యమంత్రి లాల్‌ తన్హావాలా పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు.

రాజస్తాన్‌లో 94 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్‌ అవసరమైతే ఇండిపెండెట్లను కలుపుకుని ప్రభుత్వ ఏర్పాటు చేయాలని భావిస్తుంది. 

తాండూర్ లో మంత్రి మహేందర్ రెడ్డి ఒటమి

ఓటమి దిశగా స్పీకర్ మధుసూదనచారి

నిజామాబాద్ లో రూరల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గెలుపు 

ఇబ్రహీం పట్నంలో 11వ రౌండ్ లో కిషన్ రెడ్డి కి 2015 ఆదిక్యం

మహేశ్వరంలో 4393 ఆదిక్యంలో మహాకూటమి అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి

సనత్ నగర్ లో టీఆర్ ఎస్ అభ్యర్థి గెలుపు..30,217 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన తలసాని శ్రీనివాస్ యాదవ్

2:00pm లైవ్ అప్ డేట్ 


ఓటమి :  పొన్నం ప్రభాకర్ (కరీంనగర్), సుదర్శన్ రెడ్డి (బోధన్) , ఉత్తమ్ పద్మావతిరెడ్డి(కోదాడ), పొన్నాల(జనగామ) , కొండా సరేఖ (పరకాల), బలరామ్ నాయక్  (మహబూబాబాద్) , సర్వే సత్యనారాయణ(కంటోన్మెంట్), ముఖేష్ గౌడ్ (గోషామహల్), చిన్నారెడ్డి (వనపర్తి)
ఖైరతాబాద్ 15వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 24 వేల ఓట్లు ఆదిక్యం
కూకట్ పల్లి లో  30 వేల ఓట్లతో టీఆర్ఎస్ ఆదక్యం
సికింద్రాబాద్ లో 12వ రౌండ్ లో 37 వేల ఓట్లతో టీఆర్ఎస్ ఆదిక్యం
రామగుండంలో స్వతంత్ర అభ్యర్థి చందర్ విజయం, 26,306 ఓట్టతో గెలిచిన చందర్
మంథని లో కాంగ్రెస్ విజయం, 15985 ఓట్ల గెలిచిన దుద్దళ్ల శ్రీధర్ బాబు
కుత్బుల్లాపూర్ 19వ రౌండ్ లో 20196 ఓట్లతో టీఆర్ఎస్ ఆదిక్యం
మహేశ్వరంలో కాంగ్రెస్ అభ్యర్థికి 5700 మెజార్టీ (19వ రౌండ్)
గెలుపు : కోరుట్ల - కల్వకుంట్ల విద్యాసాతర్ రావు ( టీఆర్ఎస్), జగిత్యాల - డా.ఎం. సంజయ్ కుమార్ (టీఆర్ఎస్) , ధర్మ పురి - కొప్పుల ఈశ్వర్ (టీఆర్ఎస్), రామగుండం - కోరుకంటి చందర్ (ఇండిపెండెంట్), చొప్పదండి - సొంకె. రవిశంకర్ (టీఆర్ఎస్) , వేముల వాడ, చెన్నమనేని రమేష్ ( టీఆర్ఎస్) ,  హుస్నాబాద్ - సతీష్ కుమార్ (టీఆర్ఎస్), హుజూరాబాద్- ఈటెల రాజేందర్ (టీఆర్ఎస్), 
తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థికి 2 వేల ఆదిక్యం
ఆసిఫా బాద్ లో 276 ఓట్లతో కాంగ్రెస్ గెలుపు. 
వనమా వెంకటేశ్వరరావు ప్రత్యర్థి పార్టీపై 2,200 ఆదిక్యం

5:00pm లైవ్ అప్ డేట్ 

- కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు (కాంగ్రెస్) 4 వేల మెజార్టీతో గెలుపు
- అశ్వరావు పేటలో మచ్చ నాగేశ్వరరావు (టీడీపీ) 11600 మెజార్టీలతో గెలుపు
- భద్రాచలం పి.వీరయ్య (కాంగ్రెస్) 11123 మెజార్టీతో గెలుపు

- ఉత్కంఠంగా మారిన కోదాడ ఎన్నికల ఫలితాలు
మూడు గ్రామాల్లో ఈవీఎం లు మొరాయింపు,  ప్రస్తుతం వెయ్యి ఓట్ల ఆదిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి,   వీవీప్యాట్ స్లిప్ ల ఆధారంగా కౌంటింగ్ జరపాలని కలెక్టర్ నిర్ణయం.  మొత్తం ప్రక్రియను నిలిపివేయాలని కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి డిమాండ్.  గంటపాటు నిలిచిపోయిన కౌంటింగ్ ప్రక్రియ, ఉత్కంఠంగా మారిన కోదాడ ఫలితం


మరింత సమాచారం తెలుసుకోండి: