తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ గెలుపు ఖాయమైనట్టే కనిపిస్తోంది. తొలి రౌండ్ నుంచే కారు ఆధిక్యం సంపాదించింది. ఎన్నికల ఫలితాలపై న్యూస్ ఛానళ్లు ఒక్కొక్కరు ఒక్కో ఫలితాలు ఇస్తున్నారు. అయితే అన్నీ కూడా టీఆర్‌ఎస్ ఆధిక్యత చూపించడం విశేషం.

ఎన్నికల ఫలితాల్లో విశ్వసనీయత ఉన్న ఈటీవీ ప్రకారం.. పదిన్నర గంటల సమయానికి టీఆర్‌ఎస్ 40 స్థానాల్లో ఆధిక్యత చూపిస్తోంది. కాంగ్రెస్ కేవలం 7 చోట్ల టీడీపీ ఒక్క చోట ఆధిక్యం చూపిస్తున్నాయి. ఈ ఫలితాలను బట్టి కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇవి తొలి ట్రెండ్స్ మాత్రమే అయినా.. ఫలితాలు పూర్తిగా తిరగడబటం చాలా అరుదు. ఎంత కాంగ్రెస్ కూటమి పుంజుకున్నా గట్టి పోటీ ఇవ్వగలదేమో కానీ.. పూర్తిగా గెలుచుకునే అవకాశాలు దాదాపు శూన్యం. కాబట్టి తెలంగాణలో మరోసారి కేసీఆర్ విజయం సాధించినట్టే లెక్క.


మరింత సమాచారం తెలుసుకోండి: