తెలంగాణ ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం మీద ఇప్పుడు అందరి కళ్ళు ఉన్నాయి . అయితే  పన్నెండు స్థానాల్లో పోటీలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేవలం సత్తుపల్లిలో మాత్రమే ఉనికిని చాటుతోంది. అక్కడ టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య తొలి రౌండ్ ఆధిక్యతను సంపాదించాడు. మహాకూటమిగా కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో వెళ్లిన తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో తను సొంతంగా నెగ్గిన సీట్లలో కూడా వెనుకంజవేయడం విశేషం.


వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు సుహాసిని సంచలన వ్యాఖ్యలు ... !

శేరిలింగంపల్లిలో గత ఎన్నికల్లో టీడీపీ నెగ్గిన సంగతి తెలిసిందే. అక్కడ ఈసారి తొలి రౌండ్లో టీడీపీ అభ్యర్థి భవ్య ఆనందప్రసాద్ వెనుకంజలో ఉన్నాడు. ఆయనపై తెరాస అభ్యర్థి రెండు వేల ఓట్లకు పైగా ఆధిక్యం సంపాదించడం విశేషం. ఇక అంతకన్న విశేషం కూకట్ పల్లిలో కూడా తెలుగుదేశం తొలి రౌండ్లో వెనుకబడటం. టీడీపీ అభ్యర్థి సుహాసిని అక్కడ తొలిరౌండ్లో  1,500 పైగా ఓట్ల తేడాతో వెనుకంజలో ఉంది. 

Image result for suhasini harikrishna daughter

గత ఎన్నికల్లో జూబ్లి హిల్స్ లో కూడా టీడీపీనే విజయం సాధించింది. అయితే ఈ సారి జూబ్లీహిల్స్  తెరాస అభ్యర్థి  మాగంటి గోపినాథ్ తొలి రౌండ్లో ముందజలో ఉన్నాడు. ఇక్కడ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్  రెడ్డి వెనుకంజలో ఉన్నాడు. ఫస్ట్ రౌండ్ ఫలితాలను బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్ర  సమితి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం తెరాస నలభై ఐదు స్థానాల్లో ముందజంలో ఉండగా.. కూటమి అభ్యర్థులు ఇరవై రెండు చోట్ల, బీజేపీ అభ్యర్థి ఒక్క చోట మాత్రమే లీడ్ లో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: